వైసీపీ ప్రభుత్వంపైనా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ పై నటుడు పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. పోసాని చేసిన విమర్శలపై జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ విషయమై పోసాని మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి తనపైనా తన కుటుంబం పైనా పవన్ కళ్యాణ్ అభిమానులు బూతులు మాట్లాడుతూ ఉన్నారని పోసాని వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడగా.. కొట్టడానికి కొందరు పవన్ అభిమానులు దూసుకుని వచ్చారు.

ఈ ఘటనలపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఒక వికృత క్రీడ ప్రారంభించారని.. ఈ ఆటలో పోసాని కృష్ణమురళి ఒక పెయిడ్ అర్టిస్ట్‌గా మారాడని అన్నారు. వైసీపీ నేతలు ప్రజలు వినలేని భాషలో మాట్లాడుతుంటే జగన్ చాలా సంతోషిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. "పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి భాషను ప్రయోగించి సంస్కృతీ సంప్రదాయాలను మంటగల్పుతున్నారు.

పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు ఆపడం లేదు? సామాన్య ప్రజలు కనీసం వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనంద పడిపోతున్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులైనా ఇలా మాట్లాడతారా?" అని అచ్చెన్న తన ప్రెస్నోట్ లో చెప్పుకొచ్చారు.


సామ్రాట్

Next Story