ఏపీ వ్యాప్తంగా తనిఖీలు.. 10 వేల మంది సిబ్బందితో..

By అంజి  Published on  11 March 2020 5:34 AM GMT
ఏపీ వ్యాప్తంగా తనిఖీలు.. 10 వేల మంది సిబ్బందితో..

ముఖ్యాంశాలు

  • డీజీపీ ఆదేశాలతో అధికారుల మెరుపు దాడులు
  • 10 వేల మంది సిబ్బందితో కొనసాగుతున్న తనిఖీలు
  • నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆపరేషన్‌ సురా కొనసాగుతోంది. రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ) గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలకు మేరకు, ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌కు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్ఫోర్స్‌మెంట్‌ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. పోలీస్, ఎక్సైజ్‌ శాఖ సమన్వయంతో నాటా సారా తయారీ కేంద్రాలపై ఉదయం నాలుగు గంటల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో 10 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు.

Police raids in AP

Also Read: వేడుకున్నా వినలే.. పచ్చని పంటపొలాలను దున్నేశారు!

వందలాది మంది పోలీస్‌ అధికారులతో కూడిన బృందాలతో, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, ప్రొబేషనరీ ఐపీఎస్‌, సీఐలు, ఎస్సైలతో కలిపి 10 వేల మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట నిల్వలు, నాటుసారా నిల్వలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో పూర్తిగా మద్యం, డబ్బు పంపిణీని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెరుపు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Police raids in AP

కృష్ణా జిల్లాలో పోలీస్‌, ఎక్సైజ్‌ శాఖ సమన్వయంతో నాటు సారా తయారీ కేంద్రాలపై చేపట్టిన దాడులు కొనసాగుతున్నాయి. నాటు సారా నిల్వలు ఉన్నాయనే సమాచారం మేరకు జిల్లాను అధికారులు జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో బెల్లం ఊట, నాటుసారా నిల్వలను పోలీసులు ధ్వంసం చేశారు.

Also Read: అర్థరాత్రి ఎమ్మెల్యే హల్‌చల్.. రాత్రంతా రోడ్డుపైనే!

Next Story
Share it