వారి కోసం ఒక పూట భోజనం మానెయ్యాలి.. ప్రధాని మోదీ టాస్క్‌.!

By అంజి  Published on  6 April 2020 5:59 AM GMT
వారి కోసం ఒక పూట భోజనం మానెయ్యాలి.. ప్రధాని మోదీ టాస్క్‌.!

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విలయతాండం చేస్తున్న నేపథ్యంలో భారతీయులందరినీ ఎకతాటిపైకి తేచ్చేందుకు ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలను పిలుపునిస్తున్నారు. అంతకుముందు జనతా కర్ఫ్యూ, నిన్న దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చిన మోదీ.. తాజాగా బీజేపీ కార్యకర్తలకు మరొ పిలుపునిచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. కరోనాతో పోరాడుతున్న వారికి సంఘీభావంగా కార్యకర్తలందరూ ఒక్క పూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను అందరూ పాటించాలని కోరారు.

బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు. బీజేపీని ఈ స్థాయికి తీసుకురావడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్న ప్రధాని మోదీ.. వారి త్యాగం ఫలితంగానే ప్రజలకు తాను సేవ చేసే అవకాశం కలిగిందన్నారు.



అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ కార్యకర్తలకు పార్టీ వ్యవస్థాపక దినో్త్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయాల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కరోనాపై పోరులో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని చెప్పారు. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, దీనదయాల్‌ ఉపాధ్యాయకు నివాళులర్పించారు.



బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఫీడ్‌ ద నిడ్‌ కార్యక్రమంలో ప్రతి బీజేపీ కార్యకర్త ఆరుగురికి భోజనం అందించాలని కోరారు. బూత్‌ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త మరో ఇద్దరికి ఫేస్‌ మాస్క్‌లు అందించాలన్నారు. అలాగే కరోనా సమయంలో కూడా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు కృతజ్ఞత లేఖలు ఇవ్వాలన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీలచే 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి బీజేపీ తొలి అధ్యక్షుడిగా నియమించబడ్డారు. మొదటి నుంచి బీజేపీ కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ప్రత్యర్థిగా కొనసాగింది.

Next Story