ఢిల్లీ: భిన్నత్వంలో ఏకత్వం భార‌త్ విశేష‌మ‌న్నారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో 40 ల‌క్ష‌ల మందికి యాజ‌మాన్య హ‌క్కులు క‌ల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కృత‌జ్ఞ‌త స‌భ‌లో ప్ర‌ధాని మోదీ పాల్గొన్నారు. ఈ స‌భ‌కు పెద్ద సంఖ్య‌లో బీజేపీ శ్రేణులు, కార్య‌క‌ర్తలు, ల‌బ్దిదారులు హాజ‌ర‌య్యారు. మీ భూమిపై సంపూర్ణ హ‌క్కు క‌ల్పించామ‌ని పేర్కొన్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు క‌నీసం తాగునీరు ఇవ్వ‌డం లేదని మోదీ వ్యాఖ్య‌నించారు. పౌర‌స‌త్వంపై త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని, సోష‌ల్ మీడియాలోనూ త‌ప్పుడు వీడియోలు పోస్టు చేస్తున్నార‌ని మోదీ మండి ప‌డ్డారు. ప్ర‌జ‌ల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తున్నార‌ని పార్ల‌మెంట్ లో చేసిన చ‌ట్టాన్ని సైతం గౌర‌వించ‌డం లేదన్నారు.

ఢిల్లీ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌త‌య్నం చేశారు.. అయిన‌ప్ప‌టికి ఢిల్లీ ప్ర‌జ‌లు సంయ‌మ‌నం పాటించారని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. తాము ఒక మ‌తం కోసం ప‌ని చేయ‌డం లేదని.. దేశ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నామ‌ని తెలిపారు. త‌న‌పై ఉన్న కోపాన్ని ప్ర‌జ‌ల‌పై చూపొద్దన్నారు. సీఏఏపై ముస్లింలు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదని మోదీ తెలిపారు. భార‌త్ లో డిటెన్ష‌న్ సెంట‌ర్లు ఉండ‌వని, సీఏఏ, ఎన్ ఆర్సీ ముస్లింల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తోంద‌ని మోదీ వ్యాఖ్య‌నించారు. మ‌హాత్మా గాంధీ ఆశ‌యాల‌ను తాము నెర‌వేరుస్తున్నామ‌ని అన్నారు. సీఏఏ అనేది ఎవ‌రి పౌర‌స‌త్వ‌మూ లాక్కొనేందుకు కాదని పొరుగు దేశాల నుంచి వ‌చ్చిన అల్ప సంఖ్యాక వ‌ర్గాల కోసంమ‌ని తెలిపారు.

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.