21న జాతినుద్దేశించి మోదీ ప్రసంగం
By తోట వంశీ కుమార్Published on : 18 Jun 2020 11:23 AM IST

జూన్ 21న ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రసంగిస్తారు. ప్రతి ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఆయూష్ మంత్రిత్వశాఖ ఈ ఏడాది థీమ్‌గా యోగా ఎట్ హోం, యోగా విత్ ఫ్యామిలీ ని ప్రమోట్ చేస్తుంది. ఈ ఏడాది కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి యోగాను ప్రాక్టీస్ చేయాల్సిందిగా సూచించింది.
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో యోగా ద్వారా శరీరాన్ని అదేవిధంగా మనస్సును ధృడంగా ఉంచుకోవచ్చనని, వ్యాధిపై పోరాడేందుకు ఇది ఎంతో ఉపకరిస్తుందని తెలిపింది. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read
ఐక్యరాజ్యసమితి ఎన్నికల్లో భారత్ విజయంNext Story