డ్రగ్స్ దందాలో మోదీ బయోపిక్ నిర్మాత పేరు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 12:19 PM GMT
డ్రగ్స్ దందాలో మోదీ బయోపిక్ నిర్మాత పేరు

2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ బయోపిక్ ను సందీప్ ఎస్ సింగ్ నిర్మించారు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకా అని అనుకుంటూ ఉన్నారా..? మహారాష్ట్రలో డ్రగ్స్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో సినీ నిర్మాత సందీప్ ఎస్ సింగ్ పేరు బయటకు వచ్చింది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వెనుక డ్రగ్స్ కోణం కూడా ఉందని ఇటీవల చర్చ జరుగుతోంది. దీనిపై మహారాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ సినీ నిర్మాత సందీప్ ఎస్ సింగ్ మాదకద్రవ్యాల దందా చేస్తున్నాడని తనకు చాలా రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఆయన్ను విచారించనున్నామని అన్నారు. సందీప్ సింగ్ ను సీబీఐ విచారిస్తుందన్న అనిల్ దేశ్ ముఖ్, బీజేపీ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, వాటిపైనా విచారణ జరుగుతుందని అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పటికే పలు మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ముంబైలో మాదక ద్రవ్యాల వ్యవహారం కూడా బయటకు వచ్చింది.

సీబీఐ విచారణలో డ్రగ్స్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసినట్టు తేలడంతో రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఆమె తరపు లాయర్ దీనిపై మాట్లాడుతూ రియా ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. రక్త పరీక్షలు నిర్వహిస్తే విషయం తేలిపోతుందని, బ్లడ్ టెస్ట్ కు రియా సిద్ధంగానే ఉన్నారని చెప్పారు.

రియా చక్రవర్తి కూడా ఎన్డీటీవీతో మాట్లాడుతూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గంజాయి తీసుకునే వాడంటూ చెప్పుకొచ్చింది. సుశాంత్ గంజాయి(Marijuana) తీసుకునేవాడు. ఆ అలవాటును కంట్రోల్ చేయాలని నేను అనుకున్నాను. నేను ఎప్పుడు కూడా డ్రగ్స్ డీలర్ తో మాట్లాడలేదు. డ్రగ్స్ కూడా తీసుకోలేదు. నేను బ్లడ్ టెస్ట్ కు రెడీగా ఉన్నాను.. నేను ఏది చెప్పినా దాన్ని తప్పుగా వక్రీకరిస్తున్నారని రియా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Next Story