రియా సమాధానం చెప్పని ఆ రెండు ప్రశ్నలు ఇవే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Aug 2020 11:11 AM GMT
రియా సమాధానం చెప్పని ఆ రెండు ప్రశ్నలు ఇవే..!

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై రియా చక్రవర్తిని సిబీఐ విచారిస్తోంది. ఈ విచారణలో చాలా ప్రశ్నలకు రియా చక్రవర్తి సమాధానం చెప్పిందట..! రియా సమాధానం చెప్పనిది రెండే.. రెండు ప్రశ్నలకని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇంతకూ ఆ రెండు ప్రశ్నలు ఏమిటంటే..

ఈ ఏడాది జూన్ 8న సుశాంత్‌తో విడిపోయిన అనంతరం ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారా.. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది?

ఆ తర్వాత కూడా రియా సోద‌రుడికి సుశాంత్ ఫోన్ చేశాడా.. ఆత్మహత్య చేసుకునే ముందు సుశాంత్‌ గురించి వివరాలు తెలుసుకున్నారా? అన్న ప్రశ్నలకు రియా సరిగ్గా సమాధానం చెప్పట్లేదని తెలిసింది.

కొన్ని గంటల పాటూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై రియాను ప్రశ్నించారు. ఎన్నో ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పినప్పటికీ ఈ రెండు ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పడం లేదని హిందీ మీడియా చెబుతోంది. ఆత్మహత్యకు దారి తీసిన పరిణామాలు, అకౌంట్ నుండి డబ్బులు తరలించడం, హార్డ్ డిస్కులను పగులగొట్టడం లాంటి ప్రశ్నలను ఆమెను అడిగారు.

రియాకు, ఆమె కుటుంబానికి ముప్పు ఉందని, వారికి రక్షణ కల్పించాలని ముంబై పోలీసులకు సీబీఐ లేఖ రాసింది. ఆమె నివాసం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ఉంటోందని తెలిపారు. ఆమె ఇంట్లోకి వెళ్లేందుకు కూడా మీడియా వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని లేఖలో పేర్కొంది. రియాకు సెక్యూరిటీని కల్పిస్తామని ముంబై పోలీసులు తెలిపారు. తన ఇంటి ముందు మీడియాకు చెందిన వారు గూమికూడిన వీడియోను రియా తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన సంగతి తెలిసిందే..!

తన తండ్రిని మీడియా ఎలా చుట్టుముడుతోందో మీరే చూడండి.. ఆయన గతంలో ఆర్మీలో పని చేశారు.. అలాంటి ఆయనకు ఇలాంటి పరిస్థితా అని రియా వాపోయింది. తాము ఇన్వెస్టిగేషన్ కు సహకరిస్తున్నా తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపింది. తానే తప్పు కూడా చేయలేదని.. సుశాంత్ ను ప్రేమించడమే తాను చేసిన తప్పు అని టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.

సుశాంత్ కేసులో ఇప్పటికే.. రియా చక్రవర్తి సోదరుడిని 14 గంటల పాటు సీబీఐ ప్రశ్నించింది. సుశాంత్‌ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్ధార్థ్‌ను కూడా సీబీఐ విచారించింది.

Next Story