ప్లాస్మా దానం చేయాలని కోరిన అనుష్క
By రాణి Published on 25 July 2020 4:25 PM GMTఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స్వీటీ శెట్టి...అదేనండి అనుష్క గుర్తుంది కదూ.. కరోనా కు ముందు అనుష్క నటించిన భాగమతి సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించనే లేదు. ఈ ఏడాది ఏప్రిల్ లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్ధం సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా ఆ సినిమాకు బ్రేకులు వేసింది.
ఒక్క నిశ్శబ్ధం ఏంటి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఆఖరికి హాలీవుడ్ ను కూడా కరోనా కుదిపేసింది. దాంతో చాలా వరకు సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అడపా దడపా షూటింగులు మాత్రమే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? సరే..అసలు విషయానికి వద్దాం.
#AnushkaShetty via FB & IG
Considering criticality of plasma for ailing Covid patients @cyberabadpolice Commissioner VC Sajjanar, IPS launched an app link to facilitate Plasma donors and recipients come to one platform.
Thank u sir we will definetly spread the awareness (1/3) pic.twitter.com/CWbudmdH60
— Anushka Shetty (@Anushka_ASF) July 25, 2020
మన అనుష్క కరోనా రోగుల కోసం ప్లాస్మా దానం చేయాలంటూ ఒక ట్వీట్ చేసింది. గతంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కూడా ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. పోలీస్ విభాగంలో కరోనా సోకి కోలుకున్న వారిలో ముగ్గురు ప్లాస్మా దానం చేస్తే..దాని సహాయంతో ఆరుగురి ప్రాణాలను కాపాడామని చెప్పారాయన. ఇప్పుడు అనుష్క సీపీ సజ్జనార్ కు తన సపోర్ట్ ఇస్తూ ట్వీట్ చేసిందనమాట.
ప్లాస్మా దాతలనంతా ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు సైబరాబాద్ పోలీస్ విభాగం http://donateplasma.scsc.in వెబ్ సైట్ ను లాంచ్ చేసింది. కరోనా సోకి కోలుకున్న వారంతా కరోనాతో పోరాడుతున్న వారిని రక్షించేందుకు ప్లాస్మా దానం చేయాల్సిందిగా అనుష్క ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఒకరు ప్లాస్మా దానం చేస్తే ఇద్దరిని మహమ్మారి వ్యాధి బారి నుంచి రక్షించవచ్చని, పోలీస్ యంత్రాంగానికి ప్లాస్మా దానం చేసి సహకరించాలని ఆమె కోరారు.