మరోసారి గొప్ప మనసును చాటుకున్న సోనూసూద్‌

By సుభాష్  Published on  25 July 2020 10:31 AM GMT
మరోసారి గొప్ప మనసును చాటుకున్న సోనూసూద్‌

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక సౌదీ ఆరేబియా, కిర్గిజిస్తాన్‌ దేశాల నుంచి ప్రత్యేక విమానంలో సోనూసూద్‌ సహకారంతో విద్యార్థులు, ఉద్యోగులు, వలస కూలీలు స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణికుల స్వదేశానికి చేరుకున్నారు.

విశాఖకు చేరుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారివారి సొంత జిల్లాలోని క్వారంటైన్‌ సెంటర్లకు ప్రత్యేక బస్సులో అధికారులు తరలించారు. సౌదీ నుంచి వచ్చిన విమానంలో 170 మంది, కిర్గిజిస్తాన్‌ నుంచి వచ్చిన 179 మంది ప్రయాణికులున్నారు. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా అనేక మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరేందుకు సోనూసూద్‌ కృషి ఎనలేనిదని ప్రశంసించారు.

Next Story
Share it