నాగశౌర్య ప్రీ లుక్‌ అదరిపోయింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 8:16 AM GMT
నాగశౌర్య ప్రీ లుక్‌ అదరిపోయింది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య తన లుక్‌ను మార్చేశాడు. తన కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ తేదీని ప్రకటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. సుబ్రమణ్యపురం దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈనెల 27 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూనే నాగశౌర్య తన ఫ్రీ లుక్‌ను విడుదల చేశాడు. పురాతన క్రీడల్లో ఒక క్రీడలో మిమ్మల్ని కలిసేందుకు సిద్దమవుతున్నామని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తన కెరీర్లో 20వ చిత్రంగా రాబోతున్న సినిమా కోసం శౌర్య వర్కౌట్స్ చేసి తన కటౌట్ మార్చేశాడు. ఇప్పటికే ఇంట్లోనే జిమ్ ని చేసుకొని కఠోర వ్యాయామాలు చేస్తున్న నాగ శౌర్య కండలు తిరిగిన దేహాన్ని చూసి ఇప్పుడు అందరూ వావ్ అంటున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.Next Story