ప్లాస్మా దానానికి ముందుకు రావాలని చిరంజీవి విజ్ఞప్తి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 July 2020 12:10 PM GMT
ప్లాస్మా దానానికి ముందుకు రావాలని చిరంజీవి విజ్ఞప్తి

కరోనా వైరస్‌ దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారి మందును కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. కాగా.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల్లో ప్లాస్మా థెరపీ ఒకటి. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వాళ్ల రక్తంలో యాంటీబాడీలు తయారై ఉంటాయి. వాళ్ల రక్తంలోంచి ప్లాస్మా ను తీసుకుని కరోనా రోగులకు చికిత్స చేసి వారి ప్రాణాలు కాపాడవచ్చు.

అందుకనే.. ప్రభుత్వాలు కూడా ప్లాస్మా దానం చేయండంటూ కరోనా నుంచి కోలుకున్నవాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ప్రచారానికి మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు. కరోనాను జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్మాను దానం చేసి ప్రాణాలను కాపాడాలని కోరారు. ఇప్పుడున్న క్రైసిస్‌లో కోవిడ్ వారియ‌ర్లు.. సేవియ‌ర్లుగా మారాల‌ని శనివారం మెగాస్టార్ ట్వీట్‌ చేశారు. యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కోవిడ్ విజేతలు మాన‌వ‌త్వాన్ని చాటుకోవాల‌ని కోరారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న ప్రతిఒక్కరూ ప్లాస్మా డోనేట్ చేయ‌డానికి ముందుకు రావాలంటూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపుపై మెగాస్టార్ ఈ విధంగా స్పందించారు. ఈ మేరకు సజ్జనార్ మాట్లాడిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.Next Story