వైసీపీ ఎంపీ ఇంట విషాదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Oct 2020 7:28 AM GMT
వైసీపీ ఎంపీ ఇంట విషాదం

వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం నాడు పిల్లి సతీమణి సత్యనారాయణమ్మ అకాలమరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మరణించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో విషాదచాయలు అలముకున్నాయి.

విషయం తెలుసుకున్న పిల్లి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. సత్యనారాయణమ్మ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నాడు అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. వైసీపీ పెద్దలు, జిల్లా నేతలు ఎంపీకి ఫోన్ చేసి పరామర్శించారు.

Next Story
Share it