వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

By సుభాష్  Published on  21 Aug 2020 4:30 AM GMT
వాహనదారులకు షాక్‌.. మళ్లీ పెరిగిన పెట్రోల్‌ ధరలు

పెట్రోల్‌ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. గురువారం పెరిగిన పెట్రోల్‌ ధరర శుక్రవారం కూడా పెరిగింది. డీజిల్‌ ధరలో ఎలాంటి మార్పు లేకపోగా, పెట్రోల్‌ ధర మాత్రం పెరిగిపోతోంది. శుక్రవారం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.84.38కి చేరింది. డీజిల్‌ ధర రూ.80.17 వద్ద నిలకడగా ఉంది.

ఇక ఏపీలోని అమరావతిలో లీటర్‌ పెట్రోల్‌పై 19 పైసలు పెరిగి ప్రస్తుతం రూ.85.97కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32 వద్ద ఉంది. ఇక విజయవాడలో 19 పైసలు పెరిగి ప్రస్తుతం 85.53కు చేరగా, డీజిల్‌ ధర రూ.80.91 వద్ద నిలకడగా ఉంది. ఢిల్లీలో 19 పైసలు పెరగగా, ప్రస్తుతం రూ.81.19కి చేరింది. డీజిల్‌ రూ.73.56 ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ రేట్లు పెరిగాయి.

కాగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ప్రాతిపదికన ఇంధన రిటైల్‌ కంపెనీలు పెంట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.

Next Story