సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. మహేష్‌పై వివాదస్పద ఆరోపణలు రావడంతో మరోసారి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా శ్రీరాముడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేయడంపై ఇటీవల కత్తి మహేష్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరిలో ఇలాగే సోషల్‌ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలపై జాంబాగ్‌కు చెందిన ఉమేష్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో గురువారం కత్తి మహేష్‌ను మరోసారి పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సైబర్‌ క్రైమ్‌ ఇన్స్‌పెక్టర్‌ మోహన్‌రావు తెలిపారు. మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 154 కమ్యూనల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కత్తి మహేష్‌ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదేం కొత్తేమి కాదు. 2018లోనూ రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో నగర బహిష్కరణ చేశారు. పోలీసుల అనుమతి లేకుండా అతడు హైదరాబాద్‌ నగరాన్ని రాకూడదని ఆదేశాలు కూడా జారీ చేశారు. మళ్లీ ఇప్పుడు కత్తి మహేష్‌ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం పలు వివాదాలకు దారి తీస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet