ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరారవు ఇంట విషాదం నెలకొంది. పరుచూరి వెంకటేశ్వరారవు భార్య విజయలక్ష్మీ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. విజయలక్ష్మీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయలక్ష్మీ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.

మాటల రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడు పరుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు. సోద‌రుడు పరుచూరి గోపాల‌కృష్ణ‌తో కలిసి వందలాది తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు చిరజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రచయితలుగా పని చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.