కరోనాపై పాకిస్థాన్‌లో వింత వాదన.. ఇమ్రాన్‌ఖాన్ సమక్షంలో సంచలన వ్యాఖ్యలు
By సుభాష్ Published on 27 April 2020 3:24 PM ISTకరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పట్టి పీడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200 దేశాలకుపైగా చాపకింద నీరులా విస్తరించింది. ఈ వైరస్ వల్ల ప్రపంచం మొత్తం వణికిపోతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాపించిన నాటి నుంచి రకరకాలుగా అనుమానాలు, అపోహాలు వస్తున్నాయి. ఇక కొందరు కరోనా వైరస్ వ్యాప్తికి అమ్మాయిలో కారణమంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వైరస్ వ్యాపించడానికి అమ్మాయిలే కారణమంటూ పాక్‌కు చెందిన ఓ మతపెద్ద వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు పొట్టి దుస్తులు వేసుకోవడం వల్లే వైరస్ సోకిందని, వారి వల్లే ఎక్కువగా కరోనా వ్యాపిస్తోందని పాక్ మత పెద్ద మౌలానా తారీఖ్ జమీల్ వ్యాఖ్యనించారు. అది కూడా పాక్ ప్రధాని అమ్రాన్‌ఖాన్ సమక్షంలోనే చేయడం మరింత సంచలనానికి దారి తీసింది. ఎసాహ్ టాలెథాన్ ఫండింగ్ సద్సులో జమీల్, ఇమ్రాన్ ఖాన్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సులో జమీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దూమారం రేపుతోంది.
కాగా, పాక్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకూ 15వేల మందికిపైగా కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ దేశంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో వైద్యులు కరోనా రోగులకు చికిత్సలు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇటువంటి సమయంలో జమీల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొందరికి కరోనా వైరస్‌ను అంటిపెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు ఏమన్నా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోనని జమీల్ చెప్పడం మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.