దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు ఈ కాన్ఫరెన్ష్ జరిగింది. మే 3వ తేదీతో లాక్‌డౌన్ ముగియనుండటంతో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు సేకరించారు. లాక్‌డౌన్‌ పొడిగించాలా ..? వద్దా… అనే అంశంపై చర్చించారు. అయితే మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగింపునకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. వీరిలో ఎక్కువ ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ పొడిగించాలని, అలాగే నిత్యావసరాలతో పాటు మరిన్ని భాగాలకు అనుమతించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక లాక్‌డౌన్ కొనసాగించాల్సిన ప్రాంతాలు, గ్రీన్‌ జోన్‌ ప్రాంతంలో అనుమతించాల్సిన కార్యకలాపాలు, ప్రజా రవాణా ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Lockdown

మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇక అందరి అభిప్రాయాలు సేకరించిన మోదీ కూడా లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.