లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కేంద్రం తీసుకోబోయే నిర్ణయం అదేనా..?

By సుభాష్  Published on  27 April 2020 2:14 AM GMT
లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కేంద్రం తీసుకోబోయే నిర్ణయం అదేనా..?

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇక కరోనా వచ్చిన తర్వాత వివిధ దేశాల్లో ఎందరో భారతీయులు చిక్కుకుపోయారు. సరైన విమాన సర్వీసులు లేక అక్కడే ఉండిపోయారు. అక్కడ పనులు లేక ఎంతో మంది భారతీయులు భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో కరోనా కారణంగా విమాన రాకపోకలపై నిషేధం విధించడంతో భారత్‌కు రాలేని పరిస్థితి నెలకొంది. ఇలా గల్ఫ్‌ దేశాల్లో వేలాది మంది చిక్కుకుపోయారు. వారికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక విమాన రాకపోకలు నిలిచిపోవడంతో వచ్చే వీలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే మే 3 తర్వాత , లేదంటే ఆ తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత విదేశాల్లో చిక్కుకున్న వారిని అత్యంత వేగంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

01

ప్రస్తుతం విదేశాంగ శాఖ, పౌర విమానయాన శాఖ, ఎయిర్‌ ఇండియా, రాష్ట్రాల ప్రభుత్వాలు విదేశాల్లో భారత రాయబార కార్యాలయాల సంప్రదింపులు, ఇతర అంశాలపై కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్రం అంచనా ప్రకారం త్వరలోనే లాక్‌డౌన్‌ను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మే 3న, లేదా తర్వాత ఎప్పుడై తొందరలోనే లాక్‌డౌన్‌ ఎత్తివేయవచ్చని సమాచారం. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఆ వెంటనే తన పనిని ప్రారంభించేందుకు విదేశాంగ శాఖ సిద్ధం అవుతోంది.

విదేశాల్లో ఉంటున్న వారు విమాన టికెట్‌ కొనుక్కోవాల్సిందే

ఇక విదేశాల్లో ఉంటున్న వారు భారత్‌కు రావాలంటే ఖచ్చితంగా విమాన టికెట్‌ తీసుకోవాల్సిందేననే నిబంధన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ టికెట్‌ భారాన్ని కేంద్రం భరించదన్నట్లు తెలుస్తోంది.

గల్ఫ్ దేశాల ఒత్తిడి

ముఖ్యంగా గల్ప్‌ దేశాలు విదేశీయులను వారివారి దేశాలకు వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. అయితే భారతీయులు ఇండియా కాకపోతే ఏ దేశంకైనా వెళ్లిపోవాలని సూచిస్తున్నాయట. ఇక కేరళ సర్కార్‌ విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించాలని కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నట్లు తెలుస్తోంది.

Lockdown: modi governmet

14రోజుల పాటు క్వారంటైన్‌లో..

ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులు లేవు. సరుకులు, మందులు, ఇతర వస్తువులను తీసుకువచ్చే సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఒక వేళ మే 3 తర్వాత విదేశాల్లో ఉన్న భారతీయులను తీసుకువస్తే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.

Next Story