ఢిల్లీ: సంవత్సరం పాటుగా పాకిస్తాన్‌ జైల్లో మగ్గిన ఆంధ్రా మత్స్యకారులకు విముక్తి లభించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులను పాక్‌ అధికారులు వాఘా బోర్డర్‌ వద్ద భారత్‌ అధికారులకు అప్పగించారు. మత్స్యాకారులకు రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వాఘా బోర్డర్‌కు చేరుకొని వారికి స్వాగతం పలికారు. అంతకు ముందు మత్స్యకారులను కరాచీ కారాగారం నుంచి పాక్‌ అధికారులు తరలించారు. బతుకుదెరువు కోసం 22 మంది ఆంధ్రా మత్స్యకారులు గుజరాత్‌ రాష్ట్రానికి వెళ్లారు.

2018 నవంబర్‌ 31 మత్స్యకారులు అనుకోకుండా పాక్‌ జలాల్లోకి వెళ్లారు. దీంతో వారిని పాకిస్తాన్‌ నేవీ సిబ్బంది అరెస్ట్‌ చేసింది. మత్స్యకారులు విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేశాయి. విదేశాంగ శాఖపై ఎంపీలు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో విదేశాంగ శాఖ అనేక మార్లు పాకిస్తాన్‌కు లేఖలు రాసింది. జలార్లు విడుదల కావడంతో మత్స్యకార కుటుంబాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మత్స్యకారులను మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వరాష్ట్రానికి తీసుకురానున్నారు.

అంజి గోనె

Next Story