ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం సీజ్..
By తోట వంశీ కుమార్ Published on 22 July 2020 6:42 PM ISTహైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రి పాత భవనం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్(డిఎంఈ) రమేష్‌రెడ్డి ఆదేశించారు. డిపార్ట్‌మెంట్లను వేరేచోటికి మార్చాలని, పాత భవనానికి సీల్ వేయాలన్నారు. పాత భవనంలోని పేషంట్లను పక్క భవనంలోకి తరలించనున్నారు. కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వర్షానికి ఆస్పత్రిలో నీరు చేరడం, డ్రైనేజీ నీటిలో వాన నీళ్లు కలిసి పాత భవనంలోని వార్డులోకి చేరడంతో రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఈ ఘటనపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశాయి. గత మూడు రోజులుగా ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించాలని వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పాత భవనాన్ని సీల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.