అందుకే సింహాలకు దూరంగా ఉండాలనేది..!
Zookeeper Has Finger Bitten Off By Lion After Teasing It Through Cage. సింహాలు వంటి క్రూర జంతువులకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు.
By Medi Samrat
సింహాలు వంటి క్రూర జంతువులకు దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. అయితే జూలలో వాటిని చూసుకుంటూ ఉండే వ్యక్తులు అతి దగ్గరగా వెళుతూ ఉండడం చాలా సహజం. కానీ ఒక్కోసారి వారిపైనే దాడి చేస్తూ ఉంటాయి. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
జమైకాలోని ఒక జూకీపర్ ఇటీవల సింహం బోనులోని వేలు పెట్టాడు. అయితే ఆ సింహం అతడి వేలిని చీల్చింది. వైరల్ ఫుటేజ్ లో ఈ భయంకరమైన ఘటన ఉంది. సింహం అతడి వేలును పట్టుకోగా మనిషి తన చేతిని వెనక్కు లాగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. జమైకా జంతుప్రదర్శనశాలలో సందర్శకుల ముందే ఈ ఘటన చోటు చేసుకుంది.
Never seen such stupidity before in my life. pic.twitter.com/g95iFFgHkP
— Mo-Mo💙 (@Morris_Monye) May 22, 2022
మొదట అతడు సింహం బోనులో చేయి పెడతాడు.. అతడు దాన్ని రెచ్చగొడుతూ ఉండగా.. సందర్శకులు నవ్వుతూ కనిపించారు. అంతకు ముందే అతడు సింహం నోట్లో వేలు పెట్టినా కూడా కొరకదు. కానీ సింహానికి కోపం ఎక్కువవ్వడంతో ఒక్కసారిగా అతడి వేలును నోటిలో పెట్టుకొని కొరకడం మొదలుపెట్టింది. క్షణాల్లో అతడి వేలును కొరికివేయడంతో అతడు నొప్పితో గిల గిలా కొట్టుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనలో అతడి 'రింగ్ ఫింగర్' పూర్తిగా సింహం దెబ్బకు తెగిపోయింది. అక్కడే ఉన్న వాళ్లు.. అతడు ఏదో కామెడీ చేస్తున్నాడన్నట్లుగా చూస్తూ ఉండిపోయారు. కానీ అతడు ఎగిరి కిందపడడంతో అది కామెడీ కాదని వారికి అర్థం అయింది.