వరదల్లో రీల్స్ కోసం యువతుల ఫీట్లు.. వీళ్లు ఫోన్లు ఎలా చార్జ్ చేస్తున్నారో కనుక్కో మావ..!
Young women doing insta reels in floods. సెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది.
By Medi Samrat Published on 14 July 2023 10:49 AM ISTసెల్ఫీలు, రీల్స్ పిచ్చితో యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. గతంలో ఈ పిచ్చితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. లెక్కలేనంతమంది అంగవైకల్యం బారిన పడ్డారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా.. యువత పట్టించుకోవడం లేదు. వారు అనుకున్నది చేసి తీరుతున్నారు. సోషల్ మీడియాలో లైక్‌లు, షేర్‌లు, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.
ఒకడు దోస్తుతో బైక్ పై స్టంట్స్ చేస్తే.. ఇంకొకడు అదే బైక్‌పైన ప్రియురాలితో స్టంట్స్ చేస్తాడు.. మరొకడు ఇంకాస్తా అడ్వాన్స్‌గా అమ్మాయితో రోమాన్స్ చేస్తూ బండి నడుపుతాడు. ఇలాంటి వీడియోలు తరుచూ సోషల్ మీడియాలో మన కంటపడటం, పోలీసులు కేసులు నమోదు చేయడం చూస్తుంటాం. అయినా షరా మూములే.. సోషల్ మీడియా యుగం కదా.. ఎప్పటికీ ఏదో ఓ ఘటన.. యువత మితిమీరి ప్రవర్తిస్తున్న వీడియోలు తరుచూ దర్శనమిస్తూనే ఉంటాయి.
వరదల్లో కూడా రీల్స్ కోసం ఫీట్లు pic.twitter.com/ep4yVcSq6h
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2023
ప్రస్తుతం వర్షాకాలం కదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వేరే ట్రెండ్ నడుస్తోంది. వీడియోలను ట్రెండ్ చేయడం కోసం బురదలో బొర్లడం, వానలో నృత్యం చేయడం, వరద నీటికి ఎదురెళ్లడం, మత్తడిపడ్డ ప్రదేశాల వద్ద వాహనాలతో స్పీడ్‌గా వెళ్లడం వంటివి కంటపడుతుంటాయి. ప్రస్తుతం ఈ కోవకు చెందినటువంటిదే ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ముగ్గురు యువతులు జోరుగా వర్షం పడుతుండగా.. పక్కనున్న ప్రపంచాన్ని మరిచి రీల్స్ చేస్తున్నారు. ఓ పక్క వర్షం కారణంగా కాలువలో సహాయక చర్యలు కొసాగుతున్నాయి. ఏం జరిగింది.. ఏంటి అనే కంగారులో ప్రజలందరూ చూస్తున్నారు. ఇవేవి పట్టించుకోకుండా.. ముగ్గురు యువతులు తాము అనుకున్నది పూర్తిచేశారు. ఇద్దరు యువతులు వర్షంలో.. కాలువలోకి వస్తున్న వరద నీటి వద్ద డ్యాన్స్ చేస్తుండగా.. మరో యువతి గొడుగు పెట్టుకుని మరీ.. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తుంది. వరదల్లో కూడా రీల్స్ కోసం ఫీట్లు చేస్తున్న ఆ యువతుల వీడియోను.. అక్కడున్న ఎవరో ఒకరు చిత్రీకరించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. లైక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్.. లైఫ్ మీద లేదని.. ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. వీళ్లు ఫోన్లు ఎలా చార్జ్ చేస్తున్నారో కనుక్కో మావ అంటూ మరొకరు రియాక్ట్ అయ్యారు. మరోకరు.. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ కామెంట్ చేశాడు. ఆ ఘటన జరిగిన ప్రదేశం ఎక్కడో తెలియదు కానీ.. నెట్టింట వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే.. ప్రళయమొచ్చి ప్రపంచం అంతా కొట్టుకుపోతున్నా.. మా లోకం మాదే అన్నట్లు ఉంది యువత తీరు.