ప్రియుడిని పెళ్లాడేందుకు సరిహద్దు దాటిన బంగ్లా యువతి

Woman swims to India from Bangladesh to marry lover. బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి భారత్‌కు చెందిన తన ప్రియుడిని పెళ్లాడేందుకు

By Medi Samrat  Published on  31 May 2022 8:15 PM IST
ప్రియుడిని పెళ్లాడేందుకు సరిహద్దు దాటిన బంగ్లా యువతి

బంగ్లాదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువతి భారత్‌కు చెందిన తన ప్రియుడిని పెళ్లాడేందుకు సరిహద్దులు దాటింది. ఆమె సుందర్‌బన్స్‌ అడవులను ధైర్యంగా ధాటి ఒక గంట పాటు ఈదుకుంటూ త‌న‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిని క‌ల‌వ‌డానికి భారతదేశంలోకి ప్రవేశించింది. కృష్ణ మండల్ అనే బంగ్లాదేశ్ మహిళ అభిక్ మండల్‌ను ఫేస్‌బుక్‌లో కలుసుకుని ప్రేమలో పడింది. కృష్ణకు పాస్‌పోర్టు లేకపోవడంతో అక్రమంగా సరిహద్దు దాటే మార్గాన్ని ఎంచుకుంది.

రాయల్ బెంగాల్ టైగర్స్‌కు పేరుగాంచిన సుందర్‌బన్స్‌లోకి కృష్ణ మండ‌ల్‌ ప్రవేశించడంపై పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నదిలో సుమారు గంటపాటు ఈదుకుంటూ తన గమ్యస్థానానికి చేరుకుంది. మూడు రోజుల క్రితం కృష్ణకు అభిక్‌తో కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయంలో వివాహం జరిగింది. అయితే, అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు ఆమెను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణను బంగ్లాదేశ్ హైకమిషన్‌కు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో కూడా ఓ బంగ్లాదేశ్ యువకుడు త‌న‌కిష్ట‌మైన‌ చాక్లెట్ బార్‌ కొనడానికి సరిహద్దు దాటాడు. ఎమాన్ హొస్సేన్ అనే యువ‌కుడు తనకు ఇష్టమైన చాక్లెట్ బార్‌ను కొన‌డానికి ఒక చిన్న నదిని ఈదుకుంటూ సరిహద్దు దాటి కంచెలోని గ్యాప్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాడు. యువకుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు, అనంతరం అతన్ని కోర్టు ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత అతడిని 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.











Next Story