బట్టతల.. ప్రస్తుతం యువకులను టెన్షన్ పెడుతున్న అంశం. ఎందుకంటే బట్ట తల వస్తే పెళ్లి అవ్వదేమోనని చాలా భయపడుతూ ఉన్నారు. అందుకే కొందరు తమకు బట్టతల వచ్చే ముందే పెళ్లి చేసేసుకోవాలని అనుకుంటూ ఉండగా.. ఇంకొందరేమో బట్టతలని దాచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలా బట్టతల దాచి పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తికి భార్య షాక్ ఇచ్చింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది. బట్ట తల ఉంది అనే విషయాన్ని దాచి అబద్ధం చెప్పడంతో మహిళ కోర్టుకు ఎక్కింది. కేవలం అబద్దం చెప్పాడని ఆమె కోర్టుకు తెలిపింది. పెళ్ళికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నదన్న విషయం దాచినందుకు అతనికి విడాకులిచ్చేందుకు సిద్ధమమైంది.

ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 2020 జనవరిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా ఏడాదికి అతడికి బట్టతల ఉన్న విషయం భార్యకు తెలిసింది. పెళ్లి సమయంలో జుట్టు ఒత్తుగానే ఉంది కదా.. ఇప్పుడిలా జుట్టు ఊడిపోయిందేని భర్తను నిలదీసింది. దీంతో అతడు తనకు ముందు నుంచే బట్టతల ఉందని అసలు విషయం బయటపెట్టాడు. పెళ్లిలో విగ్గు పెట్టుకున్నానని కూడా నిజాన్ని కక్కేశాడు. భర్త తనను మోసం చేశాడని అతని నుంచి విడాకులు ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.

తనకు బట్టతల ఉందని భర్త ఎన్నడూ చెప్పలేదని, ఈ విషయం చెప్పనందున భర్త నుంచి విడాకులు కోరుతున్నానని తెలిపింది. తన ఫ్రెండ్స్ ముందు అవమానానికి గురయ్యానని, ఎలాగైనా తనకు భర్త నుంచి విడాకులు కావాల్సిందేనని కోరింది. ఆమెకు నచ్చజెప్పేందుకు కుటుంబసభ్యులు.. వివాహ కౌన్సెలింగ్ కేంద్రంలోని అధికారులు తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతకూ ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో..!


సామ్రాట్

Next Story