ఉద్యోగాన్ని వదిలేసి మంత్రగత్తెగా మారిపోయింది.. ఇప్పుడు ఎంత సంపాదిస్తూ ఉందంటే

Woman Quits Her Job To Become Full-Time Witch, Earns Rs 7 Lakh Per Month. ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగం లోకి షిఫ్ట్ అవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం.

By Medi Samrat  Published on  3 May 2023 11:15 AM GMT
ఉద్యోగాన్ని వదిలేసి మంత్రగత్తెగా మారిపోయింది.. ఇప్పుడు ఎంత సంపాదిస్తూ ఉందంటే

Woman Quits Her Job To Become Full-Time Witch, Earns Rs 7 Lakh Per Month


ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగం లోకి షిఫ్ట్ అవ్వడానికి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆ మహిళ తన ఉద్యోగాన్ని వదిలేసి అనూహ్యంగా మంత్రగత్తె అవ్వాలని అనుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఏమీ వృధా కాలేదు. ప్రతి నెలా 7 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంది. ఓ మహిళ బ్యూటీషియన్ ఉద్యోగం వదిలేసి మంత్రగత్తెగా మారి ఇప్పుడు నెలకు రూ.7 లక్షలు సంపాదిస్తోంది. 29 సంవత్సరాల జెస్సికా కాల్డ్‌వెల్ మంత్రగత్తెగా మారడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టింది.

ఫేస్‌బుక్ గ్రూప్ లో మంత్రవిద్యకు ఆకర్షితురాలైన ఆమె ఆ తర్వాత ఏకంగా మంత్రగత్తెలా మారిపోయింది. ఎన్నో రకాల తాంత్రిక విద్యలను నేర్చుకున్నానని ఆమె చెబుతూ వస్తోంది. జెస్సికా మంత్రవిద్య పుస్తకాలను కొనుగోలు చేసి.. టారో కార్డులను ఎంతో బాగా చదవడం నేర్చుకుంది. ఆమెకు ఇప్పుడు 5,000 మంది క్లయింట్లు ఉన్నారు. వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారట..! నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే క్లైంట్స్ ను సంప్రదిస్తూ ఉన్నాను. నేను సెలూన్‌లో సంపాదించే డబ్బు కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నానని ఆమె తెలిపింది. ఈ పని చేస్తున్నప్పుడు మొదట నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.. కానీ నేను బాగా డబ్బు సంపాదించడం ప్రారంభించిన తర్వాత వారు నాకు మద్దతు ఇస్తున్నారని తెలిపింది జెస్సికా.


Next Story