ఇప్పటికే పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క బాధలు పడుతూ ఉంటే.. ఏకంగా అమ్మాయిలే పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు సివిల్ లైన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని ఒక ఆలయంలో పూలమాలలు మార్చుకుని, భార్యాభర్తలుగా కలిసి జీవించాలని ప్రతిజ్ఞ చేశారు. ఆశా, జ్యోతి అనే యువతులు ఈ పని చేశారు. న్యాయవాది దివాకర్ వర్మతో సహా అనేక మంది సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. పురుషులతో కలిసి జీవించడం తమకు ఇష్టం లేదని, తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోయినా, చట్టం తమ వివాహాన్ని గుర్తించకపోయినా.. తాము కలిసే జీవిస్తామని ఈ జంట చెబుతోంది.
ఇద్దరు యువతులు చాలా సంవత్సరాలుగా ప్రాణ స్నేహితులని తెలిపారు. మేము చట్టబద్ధంగా వివాహం చేసుకోలేకపోతే, మా మిగిలిన జీవితాలను భార్యాభర్తలుగా గడుపుతామని ఆ జంట తెలిపింది. మేమిద్దరం పురుషులతో ఉండటానికి ఇష్టపడనందున మేము ఈ నిర్ణయంతో ముందుకు సాగబోతున్నామని తెలిపారు.