అమ్మాయిలు మామూలుగా కొట్టుకోలేదుగా..!

Video emerges of school girls fighting in Bengaluru street. నడిరోడ్డుపై అమ్మాయిలు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

By Medi Samrat  Published on  18 May 2022 9:45 AM GMT
అమ్మాయిలు మామూలుగా కొట్టుకోలేదుగా..!

నడిరోడ్డుపై అమ్మాయిలు కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరు లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు జరిగిందో సరైన క్లారిటీ లేదని మాత్రం నెటిజన్లు చెబుతూ ఉన్నారు. వైరల్ వీడియోలో, అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి జుట్టు మరొకరు లాగడం చూడవచ్చు. ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని కొట్టడానికి కర్రను తీసుకోవడం కూడా చూడవచ్చు. ఘటనా స్థలంలో కొందరు అబ్బాయిలు కూడా ఉన్నారు. సబ్ వే మెట్ల వద్ద ప్రమాదకరంగా అమ్మాయిలు కొట్టుకోవడం, తన్నుకోవడం చూడవచ్చు.

సెయింట్ మార్క్స్ రోడ్డులో చోటు చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. మొదట వాళ్ల గొడవను ఆపడానికి అక్కడే ఉన్న కొందరు ప్రయత్నించినా కూడా వీలు పడలేదు. స్కూల్ పిల్లలు.. రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిని ఒకరు కొట్టుకోవడం చూడవచ్చు. కొందరు పాఠశాల యూనిఫారం ధరించి ఉండగా, ఇంకొందరు సాధారణ దుస్తులు ధరించారు. బిషప్ కాటన్ బాలికల పాఠశాల ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా వినియోగదారుల ప్రకారం, ఈ గొడవలో రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వాటిలో ఒకటి బెంగళూరులోని ప్రసిద్ధ బిషప్ కాటన్ బాలికల పాఠశాల అని తెలిపారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో.. ఎందుకు జరిగిందో మాత్రం తెలియదని నెటిజన్లు చెబుతున్నారు.

Next Story