యూకే అమ్మాయికి భారత తినుబండారం పేరు..!

UK couple did not name their daughter 'Pakora'. పిల్లోళ్లకు పేరు పెట్టాలంటే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. తేదీ, నక్షత్రం..

By Medi Samrat  Published on  4 Sept 2022 3:45 PM IST
యూకే అమ్మాయికి భారత తినుబండారం పేరు..!

పిల్లోళ్లకు పేరు పెట్టాలంటే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. తేదీ, నక్షత్రం.. ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే యూకేకి చెందిన ఓ అమ్మాయికి భారతీయ తినుబండారం పేరు పెట్టడం వైరల్ గా మారింది. తమ బిడ్డకు ఇష్టమైన ఆహారం పేరు పెట్టడం మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన తాజాగా చోటు చేసుకుంది. UKకి చెందిన ఒక జంట తమ బిడ్డకు పాపులర్ దేశీ స్నాక్ 'పకోరా'(పకోడా) అని పేరు పెట్టారు.

ఐర్లాండ్‌లోని న్యూటౌన్‌బ్బేలోని ది కెప్టెన్స్ టేబుల్ అనే రెస్టారెంట్ ఈ విషయాన్ని తెలిపింది. UK జంట చేసిన ఆర్డర్.. అందుకు సంబంధించిన రసీదుని, ఆగష్టు 24న జన్మించిన ఆడశిశువు చిత్రాన్ని కూడా షేర్ చేసింది. ఆ పసికందు తల్లి ది కెప్టెన్స్ టేబుల్‌లో వడ్డించే పకోరాలను తినడానికి ఇష్టపడింది. దీంతో తన బిడ్డకు అదే పేరు పెట్టింది. "Now that IS a first! Welcome to the world Pakora. We can't wait to meet you," అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వడం.. వెంటనే సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఈ విషయంపై మీమ్స్ మొదలయ్యాయి. అయినా ఇలాంటి పేరు అనుకున్న జంటకు నిజంగా హ్యాట్సాఫ్ అని అంటున్నారు నెటిజన్లు.

Next Story