కవలలే.. కానీ వేరు వేరు ఏడాదిల‌లో పుట్టారు..!

Twins born in a gap of one year, you will be surprised to know how. వేరు వేరు సంవత్సరాలలో పుట్టిన కవలల గురించి ఇంటర్నెట్ లో జనాలు

By Medi Samrat  Published on  5 Jan 2022 9:57 AM GMT
కవలలే.. కానీ వేరు వేరు ఏడాదిల‌లో పుట్టారు..!

వేరు వేరు సంవత్సరాలలో పుట్టిన కవలల గురించి ఇంటర్నెట్ లో జనాలు తెగ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు సంవత్సరాల్లో కవలలు పుట్టారు. 15 నిమిషాల వ్యవధిలో పుట్టడంతో 2021లో బాబు, 2022లో పాప జన్మించారు. కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా మాడ్రిగల్ నిండు గర్భిణీ. నేటివిడాడ్‌ వైద్య కేంద్రంలో చేరిన ఆమెకు డిసెంబర్‌ 31న రాత్రి వేళ పురుటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త ఏడాదికి కొన్ని నిమిషాల ముందు రాత్రి 11.45 గంటలకు బాబు ఆల్‌ఫ్రెడోకు జన్మనిచ్చింది. అనంతరం 12 గంటలు దాటాక‌ పాప ఐలిన్‌కు ఆమె జన్మనిచ్చింది.

దీనితో రెండు విభిన్నమైన రోజుల్లో రెండు సంవత్సరాల్లో కవలలు పుట్టినట్లు అయింది. కవలలైన తన పిల్లలు కొన్ని నిమిషాల గ్యాప్‌లో వేర్వేరు సంవత్సరాల్లో పుట్టడంపై తాను ఆశ్చర్యపోయినట్లు తల్లి ఫాతిమా మాడ్రిగల్ తెలిపారు. 2019 డిసెంబర్‌లో కూడా ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. డాన్ గిలియమ్ 2019 డిసెంబర్ 31వ తేదీ రాత్రి 11.37 గంటలకు ఒక శిశువుకు జన్మనిచ్చింది. రెండో శిశువుకు 2020 జనవరి 1వ తేదీ 12.07 గంటలకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఫాతిమా మాడ్రిగల్ బిడ్డలు కూడా అలాగే వేరు వేరు సంవత్సరాలలో జన్మించారు.


Next Story