మందులోకి స్నాక్స్ గా పామును రోస్ట్ చేసుకుని తిన్నారు.. చివరికి తాగుబోతులు ఏమైందంటే..?

Three Men Roast Snake and Consume it During Liquor Party. తాగిన మత్తులో కొందరు ఏమేమి చేస్తున్నారో కూడా తెలియదు. ఇక పూర్తీ మద్యం మత్తులో

By Medi Samrat
Published on : 21 Nov 2021 6:12 PM IST

మందులోకి స్నాక్స్ గా పామును రోస్ట్ చేసుకుని తిన్నారు.. చివరికి తాగుబోతులు ఏమైందంటే..?

తాగిన మత్తులో కొందరు ఏమేమి చేస్తున్నారో కూడా తెలియదు. ఇక పూర్తీ మద్యం మత్తులో ఉన్న వాళ్లను ఆపడం కూడా కష్టమే..! మద్యం మత్తులో ఉన్న వాళ్లు టేస్టీగా ఏదో ఒకటి తినాలని కూడా అనుకుంటూ ఉంటారు. కోరుకున్నది దొరికితే ఓకే.. దొరక్కపోతే ఏది పడితే అది తినేసే వాళ్లు కూడా ఉన్నారనుకోండి. తాజాగా మాంచి మద్యం మత్తులో ఉన్నోళ్లకు తినడానికి ఏమీ దొరకకపోవడంతో ఏకంగా పామునే చంపేసి రోస్ట్ చేసుకుని తిన్న ఘటన గురించి తెలిసి అందరూ షాక్ అవుతూ ఉన్నారు.

రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్ జిల్లాలో, పొలంలో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగుతూ ఉండగా.. తినడానికి ఏమీ దొరకలేదు. ఇంతలో వాళ్లకు పాము ఒకటి కనిపించడంతో.. ఆ పామును చంపి.. రోస్ట్ చేసుకుని తిన్నారు. అలా పామును తిన్న తర్వాత ఒకడికి ఆరోగ్యం క్షీణించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. ఏమైంది అని అడగ్గా.. ఇలా పామును తిన్నాము అనే విషయాన్ని బయటకు చెప్పారు. అంతే అందరూ షాకయ్యారు.

కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పిప్రిపురా గ్రామంలో నివసించే అతర్ సింగ్, జోగిందర్, శివరామ్‌లు కిరాణా దుకాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఉత్సాహంలో ముగ్గురూ గ్రామంలోని పొలంలో మద్యం పార్టీ చేసుకున్నారు. ఇంతలో బొరియలోంచి పాము బయటకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా పాము రంధ్రంలోకి వచ్చింది. అందులోకి నీళ్లు పోసి బయటకు తీసి మరీ చంపేశారు. ఆ తర్వాత రోస్ట్ చేసుకుని తిన్నామని చెప్పారు.




Next Story