దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఇలాంటి సమయాల్లో పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కు చాలా తక్కువమంది హాజరవ్వాలని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక మాస్కులను కూడా తప్పనిసరి చేశారు. అయితే ఫంక్షన్స్ లో మాస్కులు అయితే పెట్టుకుంటాము సరే.. మరి ఆభరాణాలు ఎలా పెట్టుకోవాలో కూడా కాస్త తెలుసుకోవాలి. అలాంటి వారందరికీ ఈ మహిళ చిట్కా ఇస్తోంది. మాస్కు మీద కూడా ఆభరణాలు ఉండేలా చేసిన ఈ మహిళకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతూ ఉంది.

పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లాలని అనుకునే వారు.. ఇలా రెడీ అయిపోతే చాలా బాగుంటుంది. మాస్క్ ముఖ్యమైనప్పటికీ.. ఆడవాళ్ళకు బంగారం కూడా ముఖ్యమే కదా..! అందుకే ఆమె ఇలా కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ ఫోటోను ఐపీఎస్ ఆఫీసర్ దీపాంషు కాబ్రా కూడా పోస్టు చేశారు. ఓ మహిళ ఫంక్షన్ కు హాజరు అయ్యింది. ఆమె పింక్ రంగు చీరను కట్టుకుంది. అంతేకాకుండా ఆభరణాలను కూడా ధరించింది. అయితే ఆమె తన మాస్కును తీయకుండా మాస్కు మీదనే ముక్కెరను ధరించింది. అది కూడా చాలా బాగుంది. భారతీయులు దేన్నైనా తమకు అనుగుణంగా మలచుకుంటారని ఈ ఫోటో ద్వారా తెలుసుకోవచ్చు. మన వాళ్లలో ఉండే ట్యాలెంట్ అంతా.. ఇంతా కాదనుకోండి. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో చాలా మంది ఆమె తెలివితేటలను మెచ్చుకుంటూ ఉన్నారు.


సామ్రాట్

Next Story