పెళ్లికి కూడా సెలవు తీసుకోని ఉపాధ్యాయుడు..!
Teacher refuses to take leave for wedding in Rajasthan. ప్రపంచ రికార్డ్ హోల్డర్, కరెంట్ అఫైర్స్ ఉపాధ్యాయుడు తన వివాహానికి సెలవు
By Medi Samrat Published on
3 May 2022 11:53 AM GMT

ప్రపంచ రికార్డ్ హోల్డర్, కరెంట్ అఫైర్స్ ఉపాధ్యాయుడు తన వివాహానికి సెలవు తీసుకోవడానికి నిరాకరించి వార్తల్లో నిలిచాడు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో సోమవారం పెళ్లి రోజున కూడా క్లాస్ కొనసాగించాలని నిర్ణయించుకోవడం ద్వారా వార్తల్లో వ్యక్తి అయ్యాడు. ప్రియే కుమార్ గౌరవ్ 'శిక్షా రథ్' ద్వారా తరగతులు బోధిస్తాడు. మే 2న ఈ ఉపాధ్యాయుడు తన పెళ్లి రోజు కావడంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తన విద్యార్థులకు తరగతులు బోధించాడు.
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని నిర్వహకులలో ఒకరైన నిర్మల్ మాట్లాడుతూ.. "గౌరవ్ ఐదు నెలల క్రితమే తన పెళ్లి తేదీ గురించి చెప్పాడు. సాధారణంగా, 4-5 రోజులు సెలవు మంజూరు చేయబడుతుంది. కానీ అతను ఏ ఒక్క క్లాస్‌ను కోల్పోకూడదని.. పెళ్లి రోజున కూడా క్లాసులు తీసుకుంటానని చెప్పాడని తెలిపారు. అన్నట్టుగాను సంగీత్ కార్యక్రమం ముగిసిన వెంటనే.. అతను ఉదయం కరెంట్ అఫైర్స్‌పై క్లాస్‌కి సిద్ధం అయ్యాడు.
Next Story