అమ్మాయి కావాలి.. పెళ్లి కోసం పోస్ట‌ర్లతో అబ్బాయి ప్ర‌య‌త్నం

Tamil Nadu man goes viral after putting up posters looking for bride. ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకోవాలంటే చాలా ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది.

By Medi Samrat
Published on : 27 Jun 2022 5:06 PM IST

అమ్మాయి కావాలి.. పెళ్లి కోసం పోస్ట‌ర్లతో అబ్బాయి ప్ర‌య‌త్నం

ప్రస్తుత కాలంలో పెళ్లి చేసుకోవాలంటే చాలా ప్రయత్నాలే చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. కొందరు పెళ్లిళ్లే చేసుకోకూడదని ఫిక్స్ అవుతూ ఉండగా.. మరికొందరు ఎలాగైనా పెళ్లిళ్లు చేసుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. మేట్రిమోనీ వెబ్ సైట్స్ లోనూ, వార్తాపత్రిక ప్రకటనల ద్వారా తమకు కావాల్సిన వారిని పెళ్లి చేసుకునే వారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి వెళ్లి మ్యాట్రిమోనియల్ సైట్‌ల ద్వారా అమ్మాయిని వెతుకుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఓ యువకుడు ఏకంగా పోస్టర్స్ వేసి మరీ పెళ్లి సంబంధం కావాలని కోరుతూ ఉన్నాడు. తమిళనాడుకు చెందిన వ్యక్తి తనకు అమ్మాయి పెళ్లి చేసుకోడానికి కావాలంటూ పోస్టర్ వేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

మదురైలోని విల్లాపురానికి చెందిన 27 ఏళ్ల ఎంఎస్ జగన్ తనకు కాబోయే భార్య కోసం పట్టణం మొత్తం పెద్ద పోస్టర్లు వేయడంతో సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్‌ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న జగన్‌ సంప్రదాయ మార్గాల్లో సరైన భాగస్వామిని వెతుక్కోలేక ఈ ప్లాన్‌ను ఆశ్రయించాడు. పోస్టర్‌లో జగన్ తన నక్షత్రం గుర్తు, కులం, వృత్తి, ఆదాయం, చిరునామా వంటి వివరాలను పేర్కొనడంతో పాటు తనకు భూమి ఉందని పేర్కొన్నారు. డెనిమ్ షర్ట్ ధరించిన ఫోటోను అందులో ఉంచాడు.మదురై 360 అనే స్థానిక న్యూస్ ఛానెల్‌తో జగన్ మాట్లాడుతూ, మేనేజర్‌గానే కాకుండా పార్ట్‌టైమ్ డిజైనర్‌గా కూడా పనిచేశారన్నారు. డిజైనర్‌గా పని చేస్తున్నప్పుడే తనకు ఈ ఆలోచన తట్టిందని చెప్పారు.





Next Story