పెళ్లి కూతురిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి హెలీకాఫ్టర్ ను తీసుకొచ్చాడు.. ఎంత ఖర్చు అయ్యిందంటే..!

Rajasthan Man Fulfills His Bride’s Dream. పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో ఆనందమైన భాగం. కొందరు వెరైటీగా

By Medi Samrat  Published on  28 April 2021 1:52 PM GMT
పెళ్లి కూతురిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి హెలీకాఫ్టర్ ను తీసుకొచ్చాడు.. ఎంత ఖర్చు అయ్యిందంటే..!

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో ఆనందమైన భాగం. కొందరు వెరైటీగా చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరేమో ఎప్పటికీ గుర్తుండిపోయేలా పనులు చేస్తూ ఉంటారు. అలా భావించిన ఓ వ్యక్తి తన భార్యను ఏకంగా హెలీకాఫ్టర్ లో అత్తారింటికి తీసుకుని వెళ్ళాడు. అత్తగారి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలనే తన భార్య కలను అతడు నిజం చేసిన ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది.

భరత్‌పూర్ జిల్లాలోని రాయ్‌పూర్ గ్రామానికి చెందిన సియారామ్ గుర్జార్ అనే యువకుడు ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత అత్తగారి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలని వధువు భావించింది. ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. తాను సరదాగా చెప్పానని భార్య అంటున్నప్పటికీ.. సోమవారం తన అత్తమామలతో గ్రామానికి హెలికాప్టర్‌లో వెళ్లాడు.

సియారామ్‌ది ఒక సాధారణ రైతు కుటుంబం. అతడికి నాద్బాయిలోని కరిలి గ్రామానికి చెందిన రమ అనే యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి చేసుకున్న తరువాత అత్తగారి ఇంటికి హెలికాప్టర్‌లో వెళ్లాలని ఉందని రమ సియారామ్‌కు చెప్పింది. ఆమె కోరికను నెరవేర్చేందుకు సియారామ్ ఈ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి వేడుకలు ముగిసిన తరువాత నవ దంపతులు, వరుడి సోదరుడు కర్తార్ సింగ్, బావ రాంప్రాసాద్‌ ఛాపర్లో సొంత గ్రామానికి వెళ్లారు. ఈ హెలికాప్టర్‌ అద్దెకు వరుడు రూ.7లక్షలు ఖర్చు చేయడం విశేషం. ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సియారామ్ ప్రయత్నాన్ని కొంతమంది అభినందిస్తుండగా, మరికొంతమంది మాత్రం చాపర్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం అనవసరం అని అంటున్నారు. భార్యకు మాత్రం జీవితాంతం గుర్తుండి పోయే గిఫ్ట్ ఇచ్చానని అతడిలో సంతృప్తి మాత్రం ఉందనుకోండి..!


Next Story