దేశంలో చాలా మంది ప్రతిభవంతులున్నారు. కానీ అదృష్టం కొందరికే దక్కుతుంది. ప్రతిభ కలిగిన వారు ఆయా రంగాల్లో రాణించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అలాంటి ఛాన్స్‌ అందరికి రాదు. కొందరిని మాత్రమే వరిస్తుంది. ఈ వ్యక్తి పరిస్థితి కూడా అంతే. ప్రస్తుతం ఫోన్‌ ఉంటే చాలు.. అరచేతిలో ప్రపంచం ఉన్నట్లు. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తమ తమ టాలెంట్‌ నిరూపించుకునేందుకు ఎన్నో వీడియోలు చేస్తూ అవకాశం దక్కించుకుంటున్నారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నా.. కొందరికి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంటుంది.


అసలు విషయం ఏంటంటే.. ఈ వీడియోలో డాన్స్‌ చేస్తున్న వ్యక్తి ఆటో డ్రైవర్‌.. సినిమా ఇండస్ట్రీలో రాణించాలనేది ఇత‌ని కోరిక. కానీ అది నెరవేరలేదు. సినిమాలో ఎలాంటి అవకాశాలు లభించకపోవడంతో చివరికి ఆటో డ్రైవర్‌ వృత్తినే ఎంచుకున్నాడు. ఈ ఆటో డ్రైవర్‌ తాజాగా ఓ వీడియో ద్వారా ఏకంగా సినిమాలో ఛాన్స్‌ కొట్టేశాడు.

మహారాష్ట్రలోని పూణే సిటీకి సమీపంలో ఉన్న బారామతి తాలుకకు చెందిన ఆటో డ్రైవర్‌ బాబాజీ కు డ్యాన్స్‌ అంటే ఎంతో ఇష్టం. డ్యాన్సర్‌గా, హీరోగా రాణించాలని ఎన్నో కలలు కన్నాడట. సరైన అవకాశాలు లభించక ఆటో డ్రైవర్‌‌ వృత్తినే నమ్ముకున్నాడు. డ్యాన్స్‌పై ఉన్న ఇష్టంతో అప్పుడప్పుడు ఆటో స్టాండ్‌ వద్దనే రోడ్డుపై డ్యాన్స్‌ చేస్తుంటాడు. అయితే ఇటీవల తన తోటి డ్రైవర్ల ఎదుట 'మల జావు ధ్యానా ఘరి' అనే పాటకు మహారాష్ట్ర పాపులర్ డ్యాన్స్ 'లవని' స్టైల్‌లో చేసి ఫిదా చేశాడు. ఆ పాట‌కు అచ్చం సినిమా హీరోలా చేశాడు. ఆ డ్యాన్స్ వీడియోను అతడి స్నేహితులు సోషల్‌ మీడియాలో షేర్ చేయగా, అది ఎంతగానో వైరల్‌ అయింది. అతని డ్యాన్స్‌కు నెటిజన్లు ఎంతో ఫిదా అయిపోయారు.

ఇక ఆ ఒక్క వీడియోతో బాబాజీ సెలబ్రిటీ అయిపోయాడు. ఈ వీడియోను మహారాష్ట్ర ఇన్ఫర్మేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ దయానంద్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం. కాగా ఈ వీడియో చూసిన మరాఠి ఫిల్మ్ డైరెక్టర్ ఘన్‌శ్యామ్ విష్ణు‌పంత్ యేడే తన సినిమాలో నటించాలని బాబాజీ కు ఆఫర్ కూడా ఇచ్చారట. ఇక సినిమాలో ఆఫర్ లభించడంతో ఆటో డ్రైవర్ కాంబ్లే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.


సామ్రాట్

Next Story