అంత చిన్న ఆటోలో 27 మందిని ఎలా ఇరికించావ్ రా నాయనా..?

Police blown away after 27 people riding one auto rickshaw defy all explanation. ఒకే ఆటోలో 27 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తూ ఉండడాన్ని చూసి

By Medi Samrat  Published on  11 July 2022 8:09 PM IST
అంత చిన్న ఆటోలో 27 మందిని ఎలా ఇరికించావ్ రా నాయనా..?

ఒకే ఆటోలో 27 మంది ప్రయాణీకులు ప్రయాణిస్తూ ఉండడాన్ని చూసి యూపీ పోలీసులు కంగుతిన్నారు. వృద్ధులు, పిల్లలతో సహా 26 మంది ప్రయాణీకులను ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు. అంతేకాకుండా.. ఏకంగా ఓవర్ స్పీడ్ లో వెళుతోంది. ఆ ఆటోను ఆపిన ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరుగా లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటన యూపీలోని ఫతేపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఫతేపూర్‌లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో పోలీసులు ఓవర్ స్పీడ్ తో ఆటో వెళుతోందని గమనించారు. అతివేగంతో వెళ్తున్న ఆటోను పోలీసులు వెంబడించారు. అధికారులు ప్రయాణికులను కిందకు దిగమని చెప్పగా.. ఆటోలో నుండి డ్రైవర్‌తో సహా 27 మంది వ్యక్తులు కిందకు రావడం చూసి వారు అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో ఆటోను సీజ్ చేశారు.









Next Story