ఈ గొర్రె ధర ఏకంగా 70 లక్షల రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

Owner of Madgyal sheep seeks Rs 1.5 cr. పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా ఒక గొర్రె ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు..

By Medi Samrat  Published on  13 Dec 2020 11:06 AM GMT
ఈ గొర్రె ధర ఏకంగా 70 లక్షల రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా ఒక గొర్రె ధర ఎంత ఉంటుందనే ప్రశ్నకు.. 3,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు ఉండవచ్చనే సమాధానం వినిపిస్తుంది. ఆ గొర్రెలో ఇంకేదైనా స్పెషాలిటీ ఉంటే కొంచెం ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తాం. కానీ ఒక గొర్రె ధర మాత్రం ఏకంగా 70 లక్షల రూపాయలు. మన దగ్గర ఉన్న గొర్రెను ఎవరైనా అంత మొత్తానికి కొంటామని చెబితే వెంటనే తీసుకోమని చెబుతాం.

అయితే ఒక వ్యక్తి మాత్రం వ్యాపారి 70 లక్షల రూపాయలు గొర్రెకు ఆఫర్ చేసినా తనకు ఇంకా ఎక్కువ మొత్తం కావాలని చెబుతున్నాడు. ఈ గొర్రె ధర అంత పలకడానికి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఆ గొర్రె అరుదైన జాతికి చెందిన గొర్రె కావడంతో పాటు ఆ గొర్రె మాంసానికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. మహారాష్ట్రలోని మాడ్గల్ గ్రామంలో మాత్రమే పెరిగే మోడ్గల్ గ్రామానికి చెందిన ఆ గొర్రె అసలు పేరు షార్జా.. కాగా ప్రస్తుతం ఆ గొర్రెను మోదీ అనే పేరుతో పిలుస్తున్నారు.

ఆ గొర్రెకు యజమాని అయిన బాబు మెట్కారి బీజేపీని అనేకసార్లు మోదీ ఎంతో కష్టపడి ఆ పార్టీ విజయం సాధించడానికి కారణమయ్యాడని ఆ కారణం వల్లే గొర్రెకు తాను కూడా అదే పేరు పెట్టానని చెప్పాడు. ఎవరైనా కోటీ 50 లక్షల రూపాయలు ఇస్తే మాత్రమే ఆ గొర్రెను అమ్ముతానని నిజానికి గొర్రెను అమ్మడం ఇష్టం లేక అంత రేటు చెబుతున్నానని బాబు మెట్కారీ వెల్లడించారు.

దాదాపు 200 గొర్రెలను పెంచుకుంటున్న బాబు మెట్కారీ రోజురోజుకు మాడ్గల్‌ జాతి గొర్రెలకు మార్కెట్ లో డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని వెల్లడించారు. మోదీ అని పేరు పెట్టిన గొర్రె తనకు, తన కుటుంబానికి కలిసొచ్చిందని అందువల్ల ఎంత డబ్బు ఆఫర్ చేసినా ఆ గొర్రెను మాత్రం అమ్మబోనని వ్యాపారి తెలిపారు. రూపంలో భిన్నంగా ఉండే ఆ గొర్రెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


Next Story