ఇది నిజం.. ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నతల్లి, కూతురు
Mother and Daughter married in Same Mandap in Gorakhpur. అవును మీరు చదివించి నిజమే.. ఒకే వేదికపై తల్లితో పాటు ఆమె
By Medi Samrat Published on 12 Dec 2020 1:58 PM GMTఅవును మీరు చదివించి నిజమే.. ఒకే వేదికపై తల్లితో పాటు ఆమె కుమారై కూడా వివాహాం చేసుకుంది. ప్రస్తుతం ఈ వివాహాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ వివాహాలు జరిగాయి.
గోరఖ్‌పూర్‌లోని పిప్రౌలి బ్లాక్‌లో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కార్యక్రమంలో భాగంగా సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలోనే తల్లి, కూతురు తమ మనసుకు నచ్చిన వాళ్లను వివాహాం చేసుకున్నారు. బేలి దేవి అనే 53 ఏళ్ల మహిళ తన సొంత మరిదిని పెళ్లాడగా.. ఆమె కుమార్తె ఇందు (27) ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది.
బేలా దేవి భర్త హరిహర్ 25 సంవత్సరాల క్రితం మరణించాడు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె చిన్న కుమారై ఇందు మినహా.. మిగతా అందరికి పెళ్లిళ్లు చేసింది. జీవిత చరమాంకంలో ఉన్న తనకు కూడా ఓ తోడు ఉండాలని బావించింది. ఇక ఆమె భర్త సోదరుడు జగదీశ్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇదే విషయాన్ని పిల్లలకు తెలుపగా.. అందుకు వారు కూడా అంగీకరించారు.
గురవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సామూహిక వివాహ వేడుకలో జగదీశ్‌ను బేలి దేవి వివాహాం చేసుకోగా.. ఆమె కుమారై ఇందూ.. రాహుల్ (29) ను మనువాడింది. దీంతో ఒకే వేదికపై ఒకే ముహూర్తానికి తల్లీ, కూతురు తమ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నారు. తల్లి మళ్లీ పెళ్లిచేసుకోవడం పట్ల కుమారై ఇందు స్పందిస్తూ.. అమ్మ, అంకుల్ జోడీ బాగుందని చెప్పింది. తమ కుటుంబ సభ్యుల్లో ఎవరికి అభ్యంతరం లేదని తెలిపింది.