బకెట్లలో డబ్బులు తీసుకుని వచ్చి సింగర్ మీద కురిపించారు
Money Showered on Gujarati singer. డబ్బుల వర్షం నిజంగా ఓ సింగర్ పై కురిసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది
By Medi Samrat Published on 20 Nov 2021 7:27 PM ISTడబ్బుల వర్షం నిజంగా ఓ సింగర్ పై కురిసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. ప్రముఖ గుజరాతీ గాయని ఊర్వశి రదాడియాపై బకెట్లతో డబ్బులు నింపి మరీ ఆమెపై చల్లారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.ఊర్వశి రదాడియా ఓ ఈవెంట్‌లో ప్రదర్శన ఇస్తూ ఉండగా.. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి బకెట్లలో నోట్లను నింపుకుని వచ్చి ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు. ఆ తర్వాత వేదిక చుట్టూ నోట్లు కనిపించాయి. ఊర్వశి రదాడియా వెనుక డబ్బుల కుప్ప ఉండడాన్ని వీడియోలో చూడవచ్చు.
ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ప్రేక్షకులు కూడా ఆమెపై కాసుల వర్షం కురిపించడం ఆశ్చర్యకరం. ఈ వీడియోను ఊర్వశి ఊర్వశి రదాడియా స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ లో వీడియోను పంచుకున్నారు. "Tulsi Marriage has been organized by Shri Samast Hirawadi Group in which Lokdaira was organized. Thank you all very much for your invaluable love'' అంటూ ఆమె పోస్టు పెట్టారు. మీ అమూల్యమైన ప్రేమకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అని ఆమె చెప్పుకొచ్చారు
ఊర్వశి రదాడియా ప్రసిద్ధ గుజరాతీ జానపద గాయని. ఆమెను కతియావర్ కోకిల అని కూడా అంటారు. ఊర్వశి 'నగర్ నంద్ జీ నా లాల్' పాటతో బాగా ఫేమస్ అయ్యారు. ఊర్వశి అహ్మదాబాద్‌లో పెరిగారు మరియు 6 సంవత్సరాల వయస్సులో సంగీత వృత్తిని ప్రారంభించారు. ఆమె మూడు సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందారు. ఈ రోజు తను ఈ స్థానంలో ఉన్నానంటే అది తన సంగీతం వల్ల మాత్రమే అని ఆమె పలు ఇంటర్వ్యూలలోచెప్పుకొచ్చారు.