లాట‌రీలో రూ.248 కోట్లు వ‌చ్చాయి.. భార్య‌, పిల్ల‌ల‌కు చెప్ప‌కుండా

Man Wins $30 Million Lottery But Refuses To Tell His Family. ఓ వ్య‌క్తి లాట‌రీలో రూ.248 కోట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Nov 2022 9:17 AM IST
లాట‌రీలో రూ.248 కోట్లు వ‌చ్చాయి.. భార్య‌, పిల్ల‌ల‌కు చెప్ప‌కుండా

సాధార‌ణంగా ఎవ‌రికైనా అదృష్టం కొద్ది లాట‌రీ త‌గిలితే ఏం చేస్తారు. ఆనందంతో గంతులు వేయ‌డంతో పాటు ఈ విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తో పంచుకుంటారు. అయితే.. చైనాకు చెందిన ఓ వ్య‌క్తి మాత్రం లాట‌రీలో రూ.248 కోట్లు గెలుచుకున్న‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని త‌న భార్య‌, పిల్ల‌ల‌కు కూడా చెప్ప‌లేదు. క‌ష్ట‌ప‌డ‌కుండా వ‌చ్చిన ఈ ధ‌నం.. ఎక్క‌డ వారిని అహంకారులుగా, సోమ‌రులుగా మార్చేస్తుంద‌నే భయమే ఇందుకు కార‌ణ‌మ‌ట‌.

గ్యాంగ్‌జి జువాంగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తికి 80 యువాన్లు(11 డాల‌ర్లు) పెట్టి 40 లాట‌రీ టికెట్లు కొన్నాడు. అత‌డు కొన్న టికెట్ల‌లో ఓదానికి జాక్‌పాట్ త‌గిలింది. 30 మిలియ‌న్ డాల‌ర్లు(భార‌త క‌రెన్సీలో రూ.248 కోట్లు) ప్రైజ్‌మ‌నీగా వ‌చ్చింది. అక్టోబ‌ర్ 24న అత‌డు ఇందుకు సంబంధించిన చెక్కును అందుకున్నాడు. అయితే.. అత‌డిని గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు ఓకార్టూన్ వేషంలో అక్క‌డ‌కు వ‌చ్చాడు.

త‌న‌కు లాట‌రీ తగిలిన విష‌యాన్ని త‌న భార్య‌, పిల్ల‌ల‌కు కూడా చెప్ప‌లేద‌ని అత‌డు తెలిపాడు. ఎందుకంటే ఇంత న‌గ‌దు వ‌చ్చింద‌ని తెలిస్తే.. వారిని వారు ఎక్కువ‌గా ఊహించుకుంటారు. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌రు. అంతేకాకుండా చ‌దువును వ‌దిలి వేస్తారు అని అత‌డు చెప్పారు. త‌న‌కు వ‌చ్చిన సొమ్ములో 5 మిలియ‌న్ యువాన్లు(6.84 ల‌క్ష‌లు) ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చాడు. ప‌న్నులు, విరాళం పోగా ఆయ‌న‌కు 24 మిలియ‌న్ డాల‌ర్లు మిగిలాయి.

గ‌త కొన్నేళ్లుగా లాట‌రీలు కొంటున్నా. కొన్ని డజన్ల యువాన్లను మాత్రమే గెలుచుకున్నాను. ఇదొక హాబీగా మారింది. ప‌దేళ్లుగా కొంటున్నా. నా కుటుంబం ఇవేమీ ప‌ట్టించుకోదు. గెలిచిన డ‌బ్బుతో ఏం చేయాల‌నేది ఇంకా నిర్ణ‌యించుకోలేదు. త్వ‌ర‌లోనే ఇందుకు ప్లాన్ చేసుకుంటా. అని చెప్పాడు. కాగా.. ఆ వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్ స్వయంప్రతిపత్త ప్రాంతానికి చెందిన లీగా గుర్తించారు.

Next Story