ఈ కేకు.. నేషనల్ సెలెబ్రిటీ

Man wanted to know if cake 'contains egg', bakery was loud and clear. నాగపూర్ సిటీ బేకరీకి సంబంధించిన ఒక కేక్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది.

By Medi Samrat
Published on : 22 May 2022 8:15 PM IST

ఈ కేకు.. నేషనల్ సెలెబ్రిటీ

నాగపూర్ సిటీ బేకరీకి సంబంధించిన ఒక కేక్ గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పార్టీ నిమిత్తం ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్‌లో కేక్‌ను ఆర్డర్‌ చేశాడు. ఓ ప్రముఖ బేకరీలో సదరు వ్యక్తి కేక్‌ను ఆర్డర్‌ చేస్తూ.. కేక్‌ ఆర్డర్‌ చేసే ముందు బేకరీ నిర్వాహకులకు ఓ సందేశాన్ని పంపించాడు. 'ఒకవేళ కేక్‌ తయారీలో కోడి గుడ్డును వినియోగిస్తే తెలిజేయండి' అంటూ తెలిపాడు. తీరా ఇంటికి వచ్చిన కేక్ బాక్స్‌ విప్పి చూసిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. కేక్‌పై.. 'ఇందులో ఎగ్‌ కలిసి ఉంది' (contains egg) అని ఉంది. బేకరీ నిర్వాహకులపై కోపం వచ్చినా, తర్వాత అది చూసి తనలో తానే నవ్వుకున్నాడు. వెంటనే ఆ కేక్‌ను ఫొటో తీసి, సోషల్‌ మీడియా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ ఫొటో చూసిన వారు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా కేక్‌ను ఆర్డర్ చేసిన నాగ్ పూర్ వాసి కపిల్ దానిని ఫోటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. "ఇది నా తల్లిదండ్రుల వార్షికోత్సవం కోసం.. నేను ఒక ప్రఖ్యాత బేకరీ నుండి చాక్లెట్ కేక్‌ని ఆర్డర్ చేసాను, అక్కడ నుండి నేను తరచుగా ఆర్డర్ చేస్తుంటాను" అని కపిల్ చెప్పుకొచ్చాడు. ఆర్డర్ చేసేటప్పుడు కేక్‌లో గుడ్డు ఉందా లేదా అన్నది చెప్పాలని అడగడంతో.. అరగంట తరువాత, కేక్, డార్క్ చాక్లెట్‌తో చెర్రీస్ తో వచ్చిన కేక్ ను చూసి.. నేను, నా భార్య నవ్వు ఆపుకోలేకపోయాము. ఫోటోను పోస్టు చేయగా.. కొన్ని గంటల్లో, ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖులు దానిని రీట్వీట్ చేయడంతో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డెలివరీ చేయబడిన కేక్ 'ఎగ్ లెస్' అని చెప్పారు.










Next Story