వారెవ్వా.. 53 ఏండ్ల కిందట పోయిన పర్సు దొరికింది.. ఇక చూస్కోండీ!

Man reunites with wallet he lost in Antarctica 53 years ago. సాధారణంగా మనం బయటికి వెళ్తుంటే వెనుక జేబులో పర్సు

By Medi Samrat  Published on  6 Feb 2021 2:36 AM GMT
వారెవ్వా.. 53 ఏండ్ల కిందట పోయిన పర్సు దొరికింది.. ఇక చూస్కోండీ!
సాధారణంగా మనం బయటికి వెళ్తుంటే వెనుక జేబులో పర్సు పెట్టుకోవడం అలవాటు. ముఖ్యమైన కార్డులతో పాటు డబ్బు పెట్టుకుంటాం. ఒక్కోసారి రద్దీగా ఉండే ప్రదేశాల్లో పర్సు కొట్టేసేవారు మన పర్సు కొట్టేస్తే ఆరోజంతా బాధపడుతూ ఉంటాం. డబ్బు పోయినా అందులో ఇంపార్టెంట్ కాగితాలు, కార్డులు దాచుకున్నాం అంటూ ఆవేదన చెందుతాం. పది నిమిషాల్లో మనం పోగొట్టుకున్నది దొరక్కపోతే పిచ్చెక్కిపోతుంది.. అలాంటిది 53 ఏండ్ల కిందట అంటార్కిటికాలో తాను పోగొట్టుకున్న పర్సు తిరిగి తన వద్దకు చేరడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


తన జ్ఞాపకాలను మళ్లీ చూస్తా అనుకోని ఆ వ్యక్తి అప్పటి పర్సు అందులో తాను ఎంతో భద్రంగా దాచుకున్నవనీ కనిపించడంతో షాక్ మాత్రమే కాదు ఉద్వేగానికి గురయ్యాడు. అమెరికా నౌకా వాతావరణ శాస్త్రవేత్త పౌల్‌ గ్రిషమ్‌ రాస్‌ ద్వీపంలో 1967 ప్రాంతంలో ఏడాది పాటు వాతావరణ శాస్త్రవేత్తగా పనిచేశారు. 13 నెలలు అక్కడ పనిచేసిన అనంతరం తిరిగి కాలిఫోర్నియాకు చేరుకున్న సమయంలో తన పర్సు పోగొట్టుకున్నట్టు తెలుసుకున్నాడు.

53 ఏండ్ల కిందట పోయిన ఈ పర్సులో ఇప్పటికీ గ్రిషమ్‌ నేవీ ఐడీ కార్డు, ఆయన డ్రైవింగ్‌ లైసెన్స్‌, ట్యాక్స్‌ స్టేట్‌మెంట్‌ సహా ఇతర వస్తువులు అన్నీ చెక్కుచెదరకుండా కనిపించాయి. ఏజెన్సీలో గతంలో పనిచేసిన స్టీఫెన్‌ డెకాటో తాను పోగొట్టుకున్న పర్సును తెచ్చిఇవ్వడంతో గ్రిషమ్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయం ఇండియానా స్పిరిట్‌ ఆఫ్‌ 45 నాన్‌ ప్రాఫిట్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ బ్రూస్‌ మెకీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తన పాత పర్సు తిరిగి చేరడం కంటే ఆ వస్తువుతో అల్లుకున్న జ్ఞాపకాలు మరువలేనివని అన్నారు.


Next Story