కాంగోకు చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ముగ్గురూ అక్కా చెల్లెల్లే కావడం విశేషం. అది కాంగోలో చోటు చేసుకుంది. ఏకకాలంలో అతనికి ప్రపోజ్ చేసిన ముగ్గురినీ అతడు వివాహం చేసుకున్నాడు. లువిజో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తూర్పు భాగంలోని సౌత్ కివులోని కలేహేలో ముగ్గురు సోదరీమణులను ఒక్క వ్యక్తే వివాహం చేసుకున్నాడు. అక్కడ ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి చట్టబద్ధంగా స్వేచ్ఛ ఉంది.
ముగ్గురు సోదరీమణులు - నటాషా, నటాలీ, నాడేగే అతడిని పెళ్లి చేసుకోమని కోరారు. ఆ ప్రశ్నను అతడు ఎదుర్కొన్నప్పుడు ముగ్గురికీ యస్ చెప్పేశాడు. ఈ ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు నేను వారికి నో చెప్పలేకపోయానని లువిజో చెప్పాడు. మిగిలిన ఇద్దరు సోదరీమణులను కలవడానికి ముందు తాను నటాలీతో ప్రేమలో పడ్డానని లువిజో చెప్పాడు. ముగ్గురూ ఒకేలా ఉంటారు కూడానూ..! వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అయితే పెళ్లి వేడుకకు వరుడి తల్లిదండ్రులు రాలేదు.
"నేను ముగ్గురినీ వివాహం చేసుకోవలసి వచ్చింది. ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు, నేను ఏమి చేస్తున్నానో నా తల్లిదండ్రులకు అర్థం కాలేదు," అని వరుడు తెలిపాడు. "మీరు ఒకదాన్ని పొందాలంటే మీరు ఇంకోదానిని కోల్పోవాలి. ప్రతి ఒక్కరికీ వారి ఇష్టాలు. వారి స్వంత పనులు ఉన్నాయి. కాబట్టి ఇతరులు ఏమనుకున్నా నేను ముగ్గురిని పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని ధిక్కరించారు. అందుకే వారు నా పెళ్లికి హాజరు కాలేదు. కానీ ప్రేమకు పరిమితులు లేవు అని నేను చెప్పగలను." అని తెలిపాడు.