తమను తాము రక్షించుకోవడానికి చేసే పనులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి ఇలాంటి ఘటనే ఎదురైంది. వ్యక్తి తన ఇంటిలోని పాములను తరిమేయడానికి నిప్పు పెట్టాడు.. ఆ సమయంలో చోటు చేసుకున్న ఘటనల ద్వారా 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆస్తిని తగలబెట్టాడు. ఆ ప్రాంతంలో పాములు సమస్యగా మారాయి. పాములను బయటకు పంపించడానికి తగినంత పొగను సృష్టించడానికి బొగ్గును ఉపయోగించాడు. అదే అతడు చేసిన పొరపాటు. అక్కడే ఉన్న పలు వస్తువులు బొగ్గు కారణంగా మంటలంటుకున్నాయి.. తీరా ఇంటి మొత్తానికి మంటలు వ్యాపించాయి.
మోంట్‌గోమెరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ ముఖ్య ప్రతినిధి పీట్ పిరింగర్ కాలిపోయిన ఇంటి యొక్క అనేక చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలలో పెద్ద పెద్ద మంటలు ఆస్తిని చుట్టుముట్టాయి. ఇక మంటలను ఆర్పివేసినప్పుడు అక్కడ మిగిలింది ఏమీ లేదని తేలింది. అదృష్టవశాత్తూ మనుషులెవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదని తేలింది. పాముల పరిస్థితి ఇంకా తెలియలేదు. బేస్ మెంట్ లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బహుళ అంతస్థుల ఇంటికి వ్యాపించాయి, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఇటీవలే ఈ ఇంటిని 1.8 మిలియన్ డాలర్లు (రూ. 13.55 కోట్లు) వెచ్చించి సదరు వ్యక్తి కొనుగోలు చేశారు.