ఆ చిన్నారి.. ఆమె కుక్క.. మీ ముఖం మీద చిరునవ్వు పక్కా..

Little girl and her pet doggo perform stunts together. ఒక చిన్నారి, ఆమె కుక్క కలిసి విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా

By Medi Samrat  Published on  22 Dec 2021 3:55 PM IST
ఆ చిన్నారి.. ఆమె కుక్క.. మీ ముఖం మీద చిరునవ్వు పక్కా..

ఒక చిన్నారి, ఆమె కుక్క కలిసి విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్యూటెంగేబిడెన్ పేరుతో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అమ్మాయి, కుక్క మధ్య స్నేహం చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియో మిస్ కాకుండా అందరూ చూడాల్సిందే.. ప్రతి ఒక్కరి ముఖం మీద నవ్వు చిగురించడం కన్ఫర్మ్..!

తక్కువ నిడివి గల వీడియోలో.. ఒక చిన్న అమ్మాయి తన పెంపుడు కుక్కతో కొన్ని అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపించింది. కుక్క తెలివిగలదని.. చిన్నారి సూచనలను పాటిస్తూ.. ఆమెతో కలిసి విన్యాసాలు చేసింది. వీరిద్దరూ ఈ విన్యాసాలు ప్రాక్టీస్ చేయడానికి చాలా సమయం వెచ్చించారని తెలుస్తోంది. అయితే వీడియో మాత్రం అద్భుతంగా వచ్చింది.

ఆ చిన్న అమ్మాయి మరియు ఆమె కుక్కకు సంబంధించిన వీడియోతో ఇంటర్నెట్ ప్రేమలో ఉంది. కొంతమంది వినియోగదారులు వారి చర్యను "చాలా వినోదాత్మకంగా" ఉందని చెబుతూ షేర్ చేయడం మొదలు పెట్టారు. "స్వచ్ఛమైన, కల్తీ లేని అమాయకత్వం ప్రేమ & ఆనందం. ఇది చిన్న పిల్లలలోనూ, కుక్కలలోనూ ఉంటుంది" అని ఒక వినియోగదారు రాశారు. ఇలా పలువురు ఈ వీడియోను చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Next Story