చలికాలం మొదలవడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలికి అధికమొత్తంలో మంచు కురవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చలికాలం వచ్చిందంటే అమెరికాలో విపరీతమైన మంచు ఏర్పడి అక్కడి ప్రజలను ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లపై విపరీతమైన మంచు కురవడంతో ప్రతిరోజు ఉదయం మంచును శుభ్రం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఒక వ్యక్తి వినూత్నమైన ఆలోచన చేశాడు. ఆలోచన రావడంతో దానిని ఆచరణలో పెట్టి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ ఆలోచన ఏమిటి? ఎలా? ఈ సమస్యను పరిష్కరించాడో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రస్తుతం చలికాలంలో తీవ్రమైన మంచు అమెరికా వాసులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా క్రిస్మస్ రోజు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరి మంచును తొలగించడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఈ సందర్భంలోనే టోరంటోకు చెందిన వ్యక్తికి ఈ సమస్యను పరిష్కరించడానికి ఓ అద్భుతమైన ఆలోచన తట్టింది. ఈ ఆలోచన ద్వారా ఎంతోమంది కష్టాలను సునాయాసంగా తీర్చుకోవచ్చని భావించాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం ఆలోచనను ఆచరణలో పెట్టి ప్రస్తుతం అందరి ప్రశంసలు పొందుతున్నాడు.


టోరంటోకు చెందిన ఆ వ్యక్తి చేతిలో పట్టుకొనే ఓ గొట్టం తో కూడిన యంత్రాన్ని కనిపెట్టాడు. ఆ గొట్టం నుంచి వేగంగా వచ్చే మంటలు క్షణాలలో మంచును కరిగిస్తుంది.దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.ప్రతి రోజూ ఎంతో శ్రమించి మంచును తొలగించే వారికి ఇది ఒక సులభమైన మార్గం అని అతని పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మానవుడి మేధస్సుకి అతను తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఇతని ద్వారా మరొక సారి రుజువైంది.


సామ్రాట్

Next Story