ఐఫోన్‌తో కేక్ కట్.. నోటితో రిబ్బన్ కట్.. కొత్త ట్రెండేమో..!

Karnataka BJP MLA’s Son Cuts Birthday Cakes With Expensive iPhone. కర్ణాటక రాష్ట్రంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుక సోషల్ మీడియాలో

By అంజి  Published on  4 Sep 2021 5:32 AM GMT
ఐఫోన్‌తో కేక్ కట్.. నోటితో రిబ్బన్ కట్.. కొత్త ట్రెండేమో..!

కర్ణాటక రాష్ట్రంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ కుమారుడు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్ కట్‌ చేశాడు. హోసపేటలో తన స్నేహితులతో బర్త్ డే వేడుకలను జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తం 8 కేకులను ఐఫోన్‌తో కట్ చేసి బర్త్‌ డే వేడుక జరుపుకున్నాడు. ఈ వీడియో ఎమ్మెల్యే బసవరాజు స్పందించారు. తన కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించాడని, ఆ డబ్బులతో ఐఫోన్ కొనుక్కుని కేక్ కట్ చేశాడని అన్నారు. కరోనా వల్ల చేతులకు బదులు ఐఫోన్ వాడడంటూ, ఇందులో తప్పేముందంటూ ఎమ్మెల్యే తన కుమారుడిని వెనకెసుకొచ్చారు.

సాధారణంగా ఏవైనా షాపులను ప్రారంభోత్సవానికి.. ఆ షాపు యాజమానులు సెలబ్రిటీలను ఆహ్వానిస్తుంటారు. సెలబ్రిటీలు వచ్చింది మొదలు.. వారు వెళ్లేదాకా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటారు. అయితే ఓ కార్యక్రమంలో చిన్న పొరపాటుతో (నవ్వులు పూయించే) పెద్ద సమస్యే వచ్చి పడింది. దీంతో కత్తెరతో కాకుండా నోటితో రిబ్బన్ కట్ చేయాల్సి వచ్చింది. పక్క దేశమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఓ షాపు ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా స్థానిక మంత్రి ఫయాజ్ హసన్ చౌహన్ హాజరయ్యారు. కత్తెరతో రిబ్బన్ కట్ చేసేందుకు మంత్రి ప్రయత్నించినా అది కట్ కాలేదు. దీంతో ఏకంగా తన పళ్లతో రిబ్బన్ కట్ చేశాడు. దీనికి సబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Next Story