భర్త భార్యను కొట్టడం.. సమర్థిస్తున్నారట..! షాకింగ్ రిపోర్ట్‌

Is husband justified in beating the wife Survey has telling responses. కారణం ఏదైనా సరే.. భార్యను భర్త కొట్టడం ముమ్మాటికీ తప్పే.. తప్పకుండా శిక్ష పడాల్సిందే..!

By Medi Samrat  Published on  27 Nov 2021 12:15 PM GMT
భర్త భార్యను కొట్టడం.. సమర్థిస్తున్నారట..! షాకింగ్ రిపోర్ట్‌

కారణం ఏదైనా సరే.. భార్యను భర్త కొట్టడం ముమ్మాటికీ తప్పే.. తప్పకుండా శిక్ష పడాల్సిందే..! చిన్న విషయమే ఇది అని ఇంకా మన చుట్టూ ఉన్న వాళ్లు అనుకుంటూ ఉన్నారు. భార్యను కొట్టే అంశం అన్నది ప్రతి ఒక్కరిలోనూ మార్పు రావాల్సిందే. మహిళల సాధికారత పెరుగుతున్నా ఇంకా గృహ హింస ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సంచలన విషయాలు బయటకు వస్తున్నారు. "మీ అభిప్రాయం ప్రకారం, భర్త తన భార్యను కొట్టడ సమర్ధిస్తారా…" అనే ప్రశ్నకు 18 రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన ప్రతిస్పందనలు షాకింగ్ గా అనిపిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 83.8 శాతం మందితో తెలంగాణ ముందంజలో ఉంది, పురుషులు తమ భార్యలను కొట్టడం సమర్థనీయమని వీరందరూ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ లో అత్యల్పంగా 14.8 శాతం నమోదు చేసింది.

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ అండ్‌ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5లో ''మీ ఉద్దేశంలో భర్త.. భార్యను కొట్టడం కరెక్టేనా..? అందుకు ఆయన్ను సమర్థించొచ్చా?'' అని సర్వే నిర్వహించగా.. మెజార్టీ మహిళలు కరెక్టే అని చెప్పారు. అత్యధికంగా తెలంగాణలో 83.8శాతం మంది మహిళలు ఒప్పుకోగా.. ఆంధ్రప్రదేశ్‌లో 83.6శాతం ఒప్పుకున్నారు. దీన్ని బట్టి తెలుగు రాష్ట్రాల మహిళలు సర్దుకుపోవడాన్ని అలవాటు చేసుకున్నారని స్పష్టంగా అర్థం అవుతోంది. కర్ణాటకలో 76.9శాతం, మణిపూర్‌లో 65.9శాతం, కేరళలో 52.4శాతం మంది మహిళలు.. భర్తలు కొట్టడంలో తప్పులేదని చెప్పారు. హిమాచల్‌లో కేవలం 14.8శాతం మహిళలే దీన్ని అంగీకరించారు.

భార్యలపై ఈ ప్రవర్తనను(కొట్టడం, దాడి చేయడం) సమర్థించుకుంటున్నారా? అని పురుషులను అడగ్గా.. అత్యధికంగా కర్ణాటకలో 81.9శాతం మంది అవునని చెప్పారు. ''భర్తకు చెప్పకుండా భార్య బయటకు వెళ్లడం, కుటుంబాన్ని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం.. భర్తతో గొడవపడటం.. శృంగారానికి నిరాకరించడం.. వంట సరిగా చేయకపోవడం, అత్తామామలకు గౌరవం ఇవ్వట్లేద''నే కారణాలతో భర్త తమను కొడుతున్నారని మెజార్టీ మహిళలు సర్వేలో చెప్పారు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ ఐదో ఎడిషన్‌ సర్వేను 2019-21 మధ్య నిర్వహించారు. ఆ వివరాలను రెండు విడతలుగా విడుదల చేశారు.


Next Story