వినోదం కోసం రోడ్డుపైకి వచ్చి స్టేప్పులేసింది. స్టేప్పులేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చివరకు పోలీసు చిక్కుల్లో పడింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన శ్రేయా కల్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడమంటే భలే ఆసక్తి. ఫ్యాన్స్ చేయమన్న డేర్‌లను చేస్తూ ఇన్‌స్టాలో పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ రోడ్డుపై జీబ్రా క్రాసింగ్ వద్ద డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పోస్టు కింద 'రూల్స్ బ్రేక్ చేయొద్దని, రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలని, తాను డ్యాన్స్ చేస్తున్నానని, అందరూ మాస్కులు ధరించాలని' అంటూ రాసుకొచ్చింది. అలాగే వీడియో డేర్ పార్ట్ -3 అని రాసుకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు ఆమె తీరును వ్యతిరేకించారు. శ్రేయా కల్రా వీడియో కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.