మీ పెంపుడు కుక్కలను అలా వాకింగ్ కు పిలుచుకొని వెళ్తారు. అవి అలా బయటకు వెళ్ళినప్పుడు తమ కాలకృత్యాలు తీర్చుకోవడం సర్వ సాధారణం. అయితే ఆ కుక్కలు మల విసర్జన చేసేసినా చూసీ చూడనట్లు వదిలి వేస్తూ ఉంటారు. అయితే ఇకపై ఢిల్లీ వాసులు పెంపుడు జంతువులను తీసుకుని వీధుల్లోకి వెళితే.. ఒక పూప్ స్కూపర్ (పాటీ పికర్)ని తీసుకెళ్లాలి. ఎందుకంటే మీ పెంపుడు జంతువు వీధిలో మల విసర్జన చేస్తే, దానిని మీరు తీసుకుని చెత్తలో విసిరేయాల్సి ఉంటుంది. అక్కడే ఉంచకూడదు.. అలా చేయడం మర్చిపోతే, మీకు రూ. 500 జరిమానా విధించవచ్చు.
ఢిల్లీలోని ఆర్‌కె పురం సెక్టార్-1 నివాసి ఫిర్యాదు మేరకు, MCD విభాగం ఓ కుక్క యజమానికి 500 రూపాయల జరిమానా విధించింది. వారు త్వరలో ఈ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మహిళ తన కుక్కను ఉదయం, సాయంత్రం బయటకు తీసుకువస్తుందని.. ఆ కుక్క బహిరంగ ప్రదేశంలో మల విసర్జన చేస్తుందని ప్రజలు ఫిర్యాదు చేశారు. తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోయారు. ఫిర్యాదును అనుసరించి, పశువైద్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ DEMS విభాగానికి చెందిన SI/ASIకి మాట్లాడుతూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం, బహిరంగ ప్రదేశంలో చెత్తను వేస్తే జరిమానా విధించే నిబంధన ఉంది.
అలాంటి ప్రదేశానికి ఎవరైనా కుక్క యజమాని వచ్చి కుక్కను తీసుకుని వచ్చి మల విసర్జన చేస్తే.. దాన్ని యజమానే స్వయంగా శుభ్రం చేయాలి. శుభ్రం చేయనందుకు 500 రూపాయల జరిమానా చెల్లించాలి. దేశంలోని అనేక రాష్ట్రాల్లోని నగరాల్లో ఇటువంటి నిబంధనలు రూపొందించబడ్డాయి.